రంగారెడ్డి

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరూర్‌నగర్, నవంబర్ 30: జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని రాష్ట్ర ప్రెస్ ఆకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. బుధవారం ప్రెస్ ఆకాడమీ కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధిపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి చైర్మన్ ఆల్లం నారాయణ అధ్యక్షత వహించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం జిఓ 225ను విడుదల చేసిందని అన్నారు. ఈ జివోను అనుసరించి జర్నలిస్టుల సంక్షేమానికి రెండు ఆర్థిక సంవత్సరాలలో రూ.20కోట్లు నిధులను జమ చేశామని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటు నుంచి ప్రమాదవశాత్తు లేదంటే మరే ఇతర కారణంతో మరణించిన జర్నలిస్టుల తరఫున కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. బాధిత కుంటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ప్రతి నెల రూ.3వేల పెన్షన్‌ను ఐదు సంవత్సరాల పాటు ఇస్తామని పేర్కొన్నారు. 10వ తరగతి తరగతిలోపు చదువుతున్న ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1000 ట్యూషన్ ఫీజ్ ఇస్తామని చెప్పారు. వర్కింగ్ జర్నలిస్టులు అనారోగ్యానికి గురై పని చేయని పరిస్థితిలో ఉంటే రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ఈ నిధులను బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం ద్వారా వచ్చిన వడ్డీతో జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేస్తామని అన్నారు. జర్నలిస్టుగా వృత్తిలో కొనసాగుతూ మరణించిన వారి దరఖాస్తులను ఆకాడమీ కార్యాలయంలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి 52 దరాఖాస్తులు రాగా, వర్కింగ్ జర్నలిస్టులు అనారోగ్యానికి గురై పని చేయని స్థితిలో ఉన్న తొమ్మిది మంది దరఖాస్తులు కార్యాలయానికి అందాయని, దరఖాస్తులను పరిశీలించిన కమిటీ వాటిని అమోదించిందని అన్నారు. అర్హులైన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు, జర్నలిస్టుకు బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లింపులు చేపట్టామని వివరించారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటన్న చర్యలపై కమిటీ సభ్యులతో చర్చించారు. దరాఖాస్తులను కమిటి సభ్యులు పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశానికి ముందు కొలంబియా విమాన ప్రమాద దుర్ఘటనలో మరణించిన జర్నలిస్టులకు, పుట్‌బాల్ క్రీడాకారులకు, విమాన సిబ్బందికి నివాళి ఆర్పించారు. సమావేశంలో కమిటీ సభ్యులు మల్లెపల్లి లక్ష్మయ్య, సిఆర్ గౌరీ శంకర్, ఎమ్.నారాయణరెడ్డి, ఎస్.వేణుగోపాల్ రావు, కె.అంజయ్య, సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకుడు నాగాయ్య కాంబ్లె, చీఫ్ ఇంజనీర్ కిశోర్‌బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ హష్మి, ప్రెస్ అకాడమీ సెక్రటరీ బి.రాజవౌళి, మేనేజర్ లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

విద్యా రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత
ఘట్‌కేసర్, నవంబర్ 30: విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనానికి నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన జరిపారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన, పేద ప్రజలందరికి ఉన్నత విద్యనందించాలనే ఉద్ధేశ్యంతోనే రాష్ట్రంలో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ అహోరాత్రులు పని చేస్తున్నట్లు చెప్పారు. మిషన్ కాకతీయ పథకం అమలుతో రాష్ట్రంలోని లక్షలాధి ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. మిషన్ భగిరధ పథకం అమలుతో అడ పడుచులకు ఇంటి వద్దనే తాగునీరు అందించనున్నట్లు చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి త్వరలో గోదావరి జలాలను అందించనున్నట్లు చెప్పారు. ఇంటింటికి ప్రభుత్వ ఖర్చుతో నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధిలో తెలంగాణలో రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతు ఘట్‌కేసర్ మండలాన్ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సహకారంతో అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి ఆదర్శంగా నిలిపినట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో తాగునీటి కొరత లేకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. జడ్పీటిసి మంద సంజీవరెడ్డి, సర్పంచ్ అండాలు, ఎంపిటిసి సంజయ్‌గౌడ్ పాల్గొన్నారు.

ఆర్టీవో కార్యాలయం జెటిసి తనిఖీ
నార్సింగి, నవంబర్ 30: ఆర్టీవో కార్యాలయంలో వినియోగదారులు దళారులను సంప్రదించకుండా నేరుగా వచ్చి ఆర్టీవో అధికారులతో వారివారి పనులను చేయించుకోవాలని రవాణా శాఖ నగర జెటిసి పాండురంగ నాయక్ అన్నారు. బుధవారం రవాణా శాఖ హైదరాబాద్ పశ్చిమ మండల కార్యాలయంలో జెటిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, పలు రికార్డులను పరిశీలించారు. కార్యాలయానికి పనికోసం వచ్చిన వినియోగదారులను అధికారుల పనితీరును కూడా అడిగి తెలుసుకున్నారు. జెటిసి మాట్లాడుతూ కార్యాలయానికి సిబ్బంది సమయపాలన పాటించాలని తెలిపారు. కార్యాలయానికి వచ్చిన వినియోగదారులకు సేవలు అందజేయాల్సిన బాధ్యత సిబ్బందిపైనే ఉందని అన్నారు. వినియోగదారులు మధ్యవర్తుల పనిలేకుండా వారివారి పనులను నేరుగా ఆర్టీవో కార్యాలయానికి వచ్చి చేసుకోవాలని పేర్కొన్నారు.
పశ్చిమ మండల రవాణా శాఖ కార్యాలయానికి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. నగరంలో పలు ఆర్టీఏ కార్యాలయాలకు ప్రభుత్వం స్థలాలు త్వరలో కేటాయిస్తామని తెలిపారు. పశ్చిమ మండల ఆర్టీవో కార్యాలయానికి ప్రభుత్వం స్థలం కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను సంప్రదించినట్లు పేర్కొన్నారు. తనిఖీలో పశ్చిమ మండల ఆర్టీఏ అధికారి సి.రమేష్, అడ్మినిస్ట్రేషన్ అధికారి మహమూద్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

షార్ట్ సర్య్కూట్‌తో పేలిన సిలిండర్

హయత్‌నగర్, నవంబర్ 30: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన గూర్చి ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్ వివరాలను వెల్లడించారు. హయత్‌నగర్ డివిజన్ రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉండే ఈదుల శ్రీనివాస్‌రెడ్డి ఫార్మసీ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం ఆయన విధులకు వెళ్లగా అతని భార్యపిల్లలు పక్కింటికి వెళ్లారు. ఇంట్లోని బెడ్‌రూమ్‌లో షార్ట్‌సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించాయి. వంటగదిలో ఉన్న సిలిండర్ పైప్ కాలిపోయి సిలిండర్ పేలిపోయింది. దీంతో పెద్ద శబ్ధంతో పేలిన సిలిండర్ భాగాలు ఎగిరి పక్కింట్లో పడిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇంట్లో ఉన్న రూ.15వేల నగదు కాలిపోవడంతో పాటు రూ.2లక్షల విలువగల సామాగ్రి ధ్వంసమైనట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అమ్మో ఒకటో తారీఖు
ఖైరతాబాద్, నవంబర్ 30: కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసి 22 రోజులు పూర్తయింది. నవంబర్ 8 నుంచి రోజుకో రూలుతో బేజారైన నగర ప్రజలకు చూస్తుండగానే ఒకటో తారీఖుకు చేరుకున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్పొరేట్, మార్కెటింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. నేడు ఒకటో తారీకు కావడంతో అన్నివర్గాలు తమ జీతాలపై దృష్టి సారించాయి. రిజర్వు బ్యాంకు విధించిన నిబంధనలు, ఆంక్షల ప్రకారం.. నగదు ఉపసంహరణతో మింగుడు పడని ప్రజానీకానికి డిసెంబర్ మాసం ఎలా గడపాలో తెలియక అయోమయానికి గురౌతున్నారు. నగదు ఉపసంహరణపై రోజుకో రూల్ మారుతుండటంతో ప్రజలు ఎప్పుడు ఎంత నగదు విత్‌డ్రా చేసుకోవాలో తికమక పడుతున్నారు. ఓ వైపు దాదాపు 96 శాతం ఏటిఎంలు నగరంలో అలంకార ప్రాయంగా మారాయి. ఎక్కడ చూసినా అవుట్ ఆఫ్ సర్వీస్.. నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఏకంగా ఏటిఎంల షట్టర్లు మూసివేసి ఉంటున్నాయి. ఇదిలా ఉండగా ఒకటో తారీకు జీతాలు పొందేక్రమంలో ప్రజల్లో ఇంకా ప్రతిష్టంభన తొలగలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మాత్రం ఉద్యోగులకు రూ. 10వేల నగదును అందిస్తామని ప్రకటించింది. నాలుగు అంకెల వేతనాలు కలిగిన వారి నుంచి ఐదంకెల జీతాలు కలిగిన ఉద్యోగులకు కలవరం మొదలయింది. రూ.20వేల నుంచి రూ.30 వేలలోపు ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తుండగా గెజిటెడ్ స్థాయి ఉద్యోగులు మాత్రం పెదవి విరుస్తున్నారు. చాలామంది ఇప్పటికే గత 8నే ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేయడంతో తాము ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, ఇతరత్రా చెల్లింపులు చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. సొంత ఇళ్లు ఉన్న వారైతే పరవాలేదు కాని దాదాపు ఏడు వేల వరకు అద్దె చెల్లించే తమ లాంటి మధ్యతరగతి ఉద్యోగస్తుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో నగదు ఉండి, చేతులో ఉన్న పాత నోట్లను జమ చేయడానికి, ఏటిఎంల నుంచి నగదును డ్రా చేసుకోవడానికి పనులను, ఉద్యోగాలను వదులుకొని గంటల తరబడి బ్యాంకులు, ఏటిఎంల ముందు చాంతాడంత క్యూలైన్‌లో నిలబడాల్సి వస్తోందని వాపోతున్నారు. రూ.2వేల నోట్లను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఇంత వరకు రూ. 500 కొత్త నోటు, రూ.100, ఇతర చిన్న నోట్లను తగినంత అందుబాటులోకి తేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఏటిఎం నుంచి రూ.2వేల నోటు విత్‌డ్రా చేసి మార్కెట్‌కు వెళ్లి కొనుగోలు చేద్దామంటే ఎవరూ చిల్లర ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఎవరినైనా కదిపితే చాలు వెయ్యికి రెండు వందల రూపాయలు కమీషన్ అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్లను నిషేధించడంలో కేంద్ర ప్రభుత్వం చూపిన ఉత్సాహం ప్రత్యామ్నాయ కరెన్సీని ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ఘోరంగా విఫలమైందని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు.
పెద్దనోట్ల రద్దుతో.. కుదేలైన రియల్ బూమ్
ఇబ్రహీంపట్నం: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో రియల్‌ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలయ్యింది. కొనుగోళ్లు, అమ్మకాలు నిలవడంతో రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకున్న వ్యాపారులకు ఎటూ పాలుపోవడం లేదు. గత కొంత కాలంగా నగర శివారు ప్రాంతమయిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగేది. జిల్లాల పునర్విభజన అంశం తెరమీదకి వచ్చిన దరిమిలా రియల్ వ్యాపారం కొంతమేరా డీలా పడింది. శంషాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడంతో నగరంతో పాటు ఇతర జిల్లాల ప్రజల కన్ను ఈ ప్రాంతంపై పడింది. దీంతో భూములకు రెక్కలొచ్చాయి. నోట్ల రద్దుతో ఎక్కడికక్కడ లావాదేవీలు నిలిచిపోయాయి. ముందస్తుగా భూములకు సంబంధించి అడ్వాన్స్‌లు ఇచ్చుకొని రిజిస్ట్రేషన్ నిమిత్తం వాయిదా వేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. భూముల రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సైతం ఖాళీగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలోని హయత్‌నగర్ శివారు ప్రాంతాలతో పాటు బొంగ్లూరు, ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం పరిసరాలు, యాచారం, మంచాల మండల కేంద్రాల పరిసరాల్లో రియల్ భూం జోరుగా సాగేది.
రియల్ వ్యాపారంపై పెట్టుబడులు పెట్టినవారి పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. పెద్దనోట్ల రద్దు, డిపాజిట్లు, లావాదేవీలపై విధించి ఆంక్షలతో పెట్టుబడులు పెట్టి వారిని వణికిస్తుండడంతో వారు భూముల వ్యవహారమై ముందుకు వచ్చేందుకు జంకుతున్నారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మరింతగా రియల్ రంగంపై ప్రభావం చూపవచ్చని విశే్లషకులు భావిస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగం రానున్న రోజుల్లో మరిన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనవచ్చన్నది విశే్లషకుల అభిప్రాయం.
పెట్టుబడులైనా తిరిగివచ్చేనా?
రియల్ భూమ్‌పై ఆశలతో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినవారి పరిస్థితి పెద్ద నోట్ల రద్దుతో ఆగమ్యగోచరంగా తయారయ్యింది. పెట్టిన పెట్టుబడులైనా తిరిగివస్తాయో లేదోనన్న మీమాంసలో వున్నారు. రియల్ భూంకు రెక్కలొచ్చిన దరిమిలా ఉన్న డబ్బునంతా పెట్టుబడిగా పెట్టి స్థిర, చరాస్తి వ్యాపారాల్లోకి దిగిన వారు కుదేలైన రియల్ రంగంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ధరలు పెరగవచ్చన్న ఆశతో భూములను కొనుగోలు చేసిన వారంతా వాటిని అమ్మేందుకు పెడుతున్నారు. ఎవరూ ముందుకు రావడం లేదు. లావాదేవీలు లేక పెట్టుబడులైనా తిరిగివస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే తమ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేర్కొంటున్నారు.
కొనసాగుతున్న నోక్యాష్ ఇబ్బందులు
గచ్చిబౌలి: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసి మూడు వారాలైనప్పటికీ నగదు కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగదు పంపిణిలో కూడా బ్యాంకులు అలసత్వం అవలంభించడంతో ఖాతాదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్‌బిఐ అధికారులు కార్పొరేట్ బ్యాంకులకు అధిక మొత్తంలో నగదు ఇస్తూ జాతీయ బ్యాంకులపై చిన్న చూపుచూపిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రా బ్యాంక్, సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకులకు రోజుకి మూడు లక్షలు ఆర్‌బిఐ నగదుని అందిస్తున్నారు. రెండుమూడు లక్షలు ఎంత మందికి ఇవ్వలో తెలియక మేనేజర్లు తలపట్టుకుంటున్నారు. వారంలో 24వేలు నగదు చెల్లిస్తామని కేంద్రం చెబుతున్నా ఒక్క వారం కూడా ప్రకటించిన విధంగా చెల్లింపులు చేయలేదు. ఏటిఎంలలో కావలసినంత నగదు పెట్టక పోవడంతో చాంతాడంత వరుసలు, అక్కడ కూడా అందరికి డబ్బులు దొరకకపోవడంతో ప్రజలు తంటాలు పడాల్సిన పరిస్థి నెలకొంది.
తగ్గిన రిజిస్ట్రేషన్లు
పెద్ద నోట్లు రద్దుచేయడంతో అప్రభావం అన్ని రంగాలపైన పడింది. రియల్ ఎస్టేట్ రంగంపై పెద్దనోట్ల ప్రభావం చాలా పడింది. అక్టోబర్‌లో 747 రిజిస్ట్రేషన్‌లు జరగగా నవంబర్‌లో 500కి పడిపోయాయి. నవంబర్ 8 తరువాత పెద్దనోట్లు చెలామణి లేకపోవడంతో చాలా మంది ముందే అగ్రిమెంటు చేసుకున్నాందున ఆ మాత్రమైనా జరిగాయని, డిసెంబర్‌లో డబుల్ డిజిట్ దాటదని అధికారులు అంటున్నారు.
చిల్లర వ్యాపారాలు వెలవెల
సూపర్ మార్కెట్లు కిటకిట
పెద్దనోట్ల ప్రభావం హైటెక్ సిటీ పరిధిలో చిల్లర వ్యాపారులను బెంబెలేత్తిస్తుంది. ఈప్రాంతంలో అధిక శాతం ఐటి ఉద్యోగులపై వ్యాపారాలు నడుస్తుంటాయి. బ్యాంకులలో డబ్బులు లేకపోవడంతోపాటు ఐటి ఉద్యోగులు ఆన్‌లైన్ లావాదేవిలకు అలవాటు పడినవారు కావడంతో సూపర్ మార్కెట్లలలో సామాన్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు. గతంలో నెల సరుకులు సూపర్ మార్కెటులో కొనుగొలు చేసిన చిన్నచితక సరుకుల