రంగారెడ్డి

లంబాడీలపై దాడులకు నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, డిసెంబర్ 16: లంబాడీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని సేవాలాల్ బంజార సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతిలాల్‌నాయక్ ఆరోపించారు. లంబాడీల దాడిపై ప్రభుత్వ మెతకవైఖరిని నిరసిస్తూ శనివారం చంపాపేట్ చౌరస్తాలో సేవాలాల్ బంజార సంఘం ఆధ్వర్యంలో ముఖ్యంత్రి కేసిఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. రహదారిపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. సంఘం నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంజార సంఘం రాస్తారోకోతో సాగర్ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. ఐ ఎస్‌సదన్ చౌరస్తా నుండి సింగరేణి కాలనీ చౌరస్తా వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో సైదాబాద్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన విరమింప చేశారు. అనంతరం సేవాలాల్ బంజార సంఘం అధ్యక్షుడు మోతిలాల్‌నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆదివాసి, లంబాడీ నాయకులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఆదివాసిల దాడిలో మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మహిళా అధ్యక్షురాలు జుక్క్భియ్, నాయకులు గణేష్‌నాయక్, గోపాల్‌నాయక్, కృష్ణనాయక్, లక్ష్మణ్‌నాయక్, శంకర్, లల్లునాయక్ పాల్గొన్నారు.
ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
షాద్‌నగర్ రూరల్: లంబాడీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శనివారం షాద్‌నగర్ ముఖ్యకూడలిలో లంబాడీల ఐక్యవేధిక ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా లంబాడీ ఐక్య వేదిక నాయకుడు శ్రీనునాయక్ మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో ఆదివాసులు పిల్లలు, మహిళలు అనేది చూడకుండా లంబాడీలపై బౌతిక దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌లో గిరిజనులపై దాడులు చేసిన ఆదివాసులను తక్షణమే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని, లేని పక్షంలో లంబాడీలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లంబాడీ ఐక్యవేధిక నాయకులు జర్పుల రాజునాయక్, రమావత్ శంకర్, ఈశ్వర్, గోపాల్‌నాయక్, సుమన్‌నాయక్, డి.రాజు నాయక్, మోహన్‌నాయక్, రామునాయక్ పాల్గొన్నారు.
లంబాడీలకు రక్షణ కల్పించాలి
కొత్తూరు: లంబాడీలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంతోపాటు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొత్తూరు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. శనివారం కొత్తూరు తహశీల్దార్ శకుంతలకు గిరిజనులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లంబాడీలు మాట్లాడుతూ ఆదివాసీలు గిరిజనులపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. లంబాడీలపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.