రంగారెడ్డి

సీట్లు కరువైన ‘మన నగరం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, డిసెంబర్ 16: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన నగరం’ కార్యక్రమానికి సీట్లు కరువయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్లకు కలిపి పేట్‌బషీరాబాద్ లోని పీఎస్‌ఆర్ కనె్వన్షన్ హాల్‌లో ‘మన నగరం’ కార్యక్రమాన్ని శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఉదయం తొమ్మిది గంటల నుండి హాల్‌లోపలికి పలు బస్తీలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, వార్డు కమిటీ, ఏరియా కమిటీ సభ్యులతో పాటు కార్పొరేటర్‌లను అనుమతించారు. పాసులు ఉన్న వారిని మాత్రమే కార్యక్రమానికి అనుమతించగా ఉదయం పదిన్నర గంటల సమయం కాగానే పాసులు ఉన్నా హాల్‌లోనికి పోలీసులు అనుమతించలేరు. అయితే, హాల్ నిండిపోయిందని, సీట్లు లేవని సూరారం, సుభాష్‌నగర్, జీడిమెట్ల, ఎస్‌ఆర్ నాయక్ నగర్‌ల నుండి వచ్చిన సభ్యులను లోనికి అనుమతించలేరు. కుత్బుల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ కేఎం పారిజాత గౌరీష్ సుమారు 11 గంటల సమయంలో హాల్‌కు వచ్చారు. అయితే, పోలీసులు కాసేపు పారిజాతను ఆపి ఆ తరువాత లోపలికి అనుమతించారు. అసోసియేషన్ సభ్యులకు సీట్లు లేవని అనుమతించని పోలీసులు కార్పొరేటర్‌లకు మాత్రం ఉంటాయా? అని పలువురు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, హాల్ గేటు ఎదుట లోపలికి అనుమతించి పలు బస్తీల సభ్యులు పాస్‌లను ప్రదర్శిస్తూ నిలబడ్డారు. కార్యక్రమానికి మీడియా ప్రతినిధులను హాల్ లోపలికి అనుమతించకపోవడం విశేషం.

ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు

* శాంతినికేతన్‌లో సైన్స్ ప్రదర్శన * ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 16: ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు అనేక అంశాలపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని శాంతినికేతన్ హైస్కూల్ డైరెక్టర్ సుంకరి రంగారావు అన్నారు. ఛత్రినాకలోని శాంతినికేతన్ హైస్కూల్‌లో చిన్నారుల రూపొందించిన వివిధ ప్రదర్శనలతో కూడిన ఎగ్జిబిషన్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తే వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భాద్యతయుతంగా వ్యవహరించి వారికి కావాల్సిన ఏర్పాట్లను చేసి చక్కటి శిక్షణనిచ్చి అన్ని విధాలా తీర్చిదిద్దాలన్నారు. హైస్కూల్ ప్రిన్సిపాల్ విమల రంగారావు చిన్నారులు ప్రదర్శించిన వివిధ అంశాలతో కూడిన ప్రదర్శనలు తిలకించి, వారిని అభినందించారు. తప్పనిసరిగా చెట్లను నాటాలని చిన్నారులు ఏర్పాటుచేసిన ప్రదర్శన పలువురిని ఎంతగానో అకట్టుకుంది.