రంగారెడ్డి

సభలు సరే.. విశ్వ విద్యాలయం మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, డిసెంబర్ 16: తెలుగు విశ్వ విద్యాలయం అభివృద్ధి కోసం రాజకీయ పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. శివారులోని బాచుపల్లి గ్రామం, సాయినగర్‌లో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయాన్ని బీజేపీ నాయకుల బృందం పరిశీలించింది. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాంతారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందనం దివాకర్, పార్టీ కార్యకర్తలతో కలిసి లక్ష్మణ్ విశ్వ విద్యాలయంలోని వసతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ.. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుండి పేద విద్యార్థులు చదువుతున్న తెలుగు విశ్వ విద్యాలయంలో కనీస వసతులు లేకపోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 ఎకరాల స్థలంలో కోట్ల రూపాయలను వెచ్చించి నిర్మించిన విశ్వ విద్యాలయంలో విద్యార్థుల సౌకర్యార్థం తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు లేకపోవడంతో పాటు పాములు సంచరించే ప్రాంతంలో తెలంగాణ బిడ్డలు విద్యనభ్యసించాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. విశ్వ విద్యాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని.. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడంతో పాటు తెలుగు విశ్వ విద్యాలయాన్ని అభివృద్ధి పర్చాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగ మేళాకు విశేష స్పందన

మేడ్చల్, డిసెంబర్ 16: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం వివిధ పరిశ్రమల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ నర్యయ్యగౌడ్ పేర్కొన్నారు. జాబ్ మేళాను ప్రారంభించి ప్రిన్సిపాల్ నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు ఆశించిన లక్ష్యాలను చేరేందుకు అంకితభావంతో శ్రమించాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత రంగాల్లో స్థిరపడేందుకు ధృడసంకల్పంతో కృషి చేయాలన్నారు. ఉద్యోగ మేళాల ద్వారా విద్యార్థుల్లో అవగాహన పెరగడంతో ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయా పరిశ్రమల్లో సాంకేతిక విద్యార్థులకు ఉపాధి అవకాలు కల్పించేందుకు యాజమాన్యాలను ఒప్పించి జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జాబ్ మేళాకు విశేషమైన స్పందన లభించిందని ఇందులో చేగుంట, కొత్తగూడెం, వీఎన్‌ఆర్ విఙ్ఞన్ జ్యోతి, సంస్కృతి తదితర సాంకేతిక కళాశాలలకు చెందిన మొత్తం 400లకు పైగా విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు.
జాబ్ మేళాలో రాణే ఇంజన్ వాల్వ్‌స్, డెల్‌కాస్ట్, ఆల్‌కెస్ట్ క్యాస్టింగ్, యాక్ట్ ఫైబర్ తదితర కంపెనీలు పాల్గొన్నాయని వివరించారు. కార్యక్రమంలో టీపీఓ జి.దీపికారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.