రంగారెడ్డి

సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించడానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, జనవరి 3: ప్రతి గ్రామంలో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించడానికి కృషి చేయాలని జిల్లా పరిషత్ సిఇఓ రమణారెడ్డి అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోన్ని అన్నిశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ అభియాన్ పథకం ద్వారా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలపై ఆరాతీశారు. అసంపూర్తిగా ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. బిల్లులు అందని వారిని గుర్తించి జాబితా తయారుచేసి పంపాలన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో నగదు రహిత లావాదేవీలు అమలుచేసేలా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఇంటి, నీళ్లు, స్థిరాస్తి పన్నులు వసులు చేయాలని అన్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా సమస్యలు లేకుండా చూసుకోవాలని ఏఈని ఆదేశించారు. అంతకు ముందు చేవెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో నూతన సంవత్సరం పురస్కరించుకొని రమణారెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సత్యనారాయణరాజు, ఎంపిడివో రత్నమ్మ, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

డిజిటల్ లావాదేవీలను వినియోగించుకోవాలి

రాజేంద్రనగర్, జనవరి 3: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని డిజిటల్ లావాదేవీలను అనుసరించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఉప కమిషనర్ సైదులు సూచించారు. మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థలో ఎస్‌ఆర్‌పిలకు డిజిటల్ లావాదేవీలపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలు ఏ విధంగా నిర్వహించుకోవాలో ఎస్‌ర్‌పీలు శిక్షణలో నేర్చుకోవాలని సూచించారు.
ఎస్‌ర్‌పిలు తెలుసుకున్న నగదు రహిత లావాదేవీల గురించి గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని వివరించారు. అన్ని గ్రామ పంచాయతీలను నగదు రహిత లావాదేవీలు నిర్వహించుటకు నిర్ణీత కాలవ్యవధిలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. జనవరి 10వ తేదీలోపు అన్ని గ్రామాల్లో శిక్షణలు పూర్తి చేయాలని వెల్లడించారు. టిసిపార్డు సంయుక్త సంచాలకులు నరేంద్రనాధ్‌రావు మాట్లాడుతూ.. డిజిటల్ లావాదేవీలకు సంబంధించి అన్ని రకాల మొబైల్‌యాప్‌లను క్లుప్తంగా వివరించారు. వాటి వినియోగంలో పూర్తి అవగాహన పెంచుకొని ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. సిఎన్‌ఆర్‌ఎం విభాగాధిపతి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 50 లక్షల మంది ఉపాధి కూలీలు పని చేస్తున్నారని, వారికి వేతనాల రూపంలో రూ.2400 కోట్లు చెల్లిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 35 లక్షల మంది ఆసరా పింఛన్‌దారులకు రూ.4800 కోట్లు చెల్లిస్తున్నారని, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.8వేల కోట్లు చెల్లిస్తున్నారని చెప్పారు. వివిధ రకాల గ్రామీణ ఆర్థిక కార్యకలాపాల వాటాదారులందరికీ డిజిటల్ లావాదేవీలపై రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్‌లు అన్ని స్థాయిలలో శిక్షణలు ఇవ్వడానికి పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సెర్ప్ డైరెక్టర్ లక్ష్మి, గ్రామీణాభివృద్ధి డైరెక్టరేట్ అధికారులు పి.కృష్ణమూర్తి, మురళీ, మాధవిలత, టిఎంకే గాంధీ పాల్గొన్నారు.