రంగారెడ్డి

చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, ఫిబ్రవరి 28: చర్లపల్లి పారిశ్రామికవాడలో ప్రమాదవశాత్తు త్రీడి ఫోమ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఫేజ్ 5లోని త్రీడి థర్మోకోల్ ఫోమ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగినట్టు స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించినట్టు తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు నాలుగు ఫైర్ ఇంజన్లు సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు అధికారి శంకర్‌రెడ్డి తెలిపారు. థర్మోకోల్ పరిశ్రమలో ఎక్కువ ఫోమ్ ఉండడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయని పేర్కొన్నారు. మంటల పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అగ్నిమాపక అధికారి తెలిపారు.

ప్రజారోగ్యం, మానవహక్కుల పరిరక్షణపై అధ్యాయనం

తాండూరు, ఫిబ్రవరి 28: భారత్‌లో ప్రజారోగ్యం మానవహక్కుల పరిరక్షణ విధానాలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అనే అంశాలపై అధ్యాయనం చేయడానికి అమెరికా నుంచి విచ్చేసినట్లు హర్వార్డ్ యూనివర్శిటీ పబ్లిక్ హెల్త్ అండ్ హుమన్ రైట్స్ అధ్యాయన విద్యార్థి బృందం పేర్కొంది. మంగళవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి, అక్కడి నుండి పట్టణంలోని ధన్‌గర్‌గల్లిలో ఉన్న శిశుగృహ కేంద్రాన్ని సందర్శించారు. భారత్‌లో ప్రజారోగ్యం, మానవహాక్కుల పరిరక్షణకు ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవిధంగా అమలు అవుతున్నయో అధ్యాయనం చేస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు సభ్యుల బృందం గత నెల రోజులుగా భారత్‌లోని ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలలో పర్యటించి నేరుగా తెలంగాణకి చేరుకున్నట్లు వివరించారు. కాగా తెలంగాణలో ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇటివలే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దివ్య సోమవారం తమ భేటీలో తెల్పినట్లు చెప్పారు. చైల్డ్‌లైన్ 1098 ప్రోగ్రామ్ ద్వారా చిన్నారుల హక్కులను కాపాడటం, అనాథలు, జీవన విధానం సరిగ్గాలేని వారిని ఆదరించి అక్కున చేర్చుకోవడం వంటి పద్ధతులు నచ్చినట్లు పేర్కొన్నారు. అమెరికాలోనూ బాలల హక్కుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలను ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తుందని చెప్పారు. బాలలు, చిన్నారుల భద్రతకు కఠిన చట్టాలు ఉన్నాయని వివరించారు. సొంత తల్లిదండ్రుల వేధించినా అమెరికా ప్రభుత్వం చట్టపరంగా చర్యలు చేపడుతుందని అన్నారు. తమ యూనివర్శిటీకి చెందిన బృందం సభ్యులు మరింత ఎక్కువ మందితో త్వరలో మరోసారీ ఇండియాను సందర్శించటానికి కార్యక్రమం రూపొందించుకున్నారని విద్యార్థులు ఎలిజబెత్ డోంగర్, ఆయూషా తెలిపారు. భారత్‌లో చైల్డ్‌లైన్ అభివృద్ధికి భూరి విరాళాలు, శిశుగృహ, స్టేట్ హోం వంటి బాలల పరిరక్షణ కేంద్రాల అభ్యున్నతి కోసం షెల్టర్లు పెంచుకోవడానికి అంతర్జాతీయ సమాజం నుంచి విరాళాలు, అన్ని విధాల సహకారం అందేలా భారత్, అమెరికా కన్సూలేట్‌ల ప్రోద్భలంతో చర్యలకు తమ అధ్యాయన రికార్డులు, నివేదికలు తోడ్పాటుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యాయన బృందానికి ట్రాన్స్‌లేటర్ తోడ్పాటుగా హైదరాబాద్‌కు చెందిన బాలల హక్కుల పరిరక్షణ వేదిక సలహాదారు వర్షాభార్గవి, తాండూరు చైల్డ్‌లైన్ సభ్యులు వెంకట్ రెడ్డి, వెంకటేశ్, శిశుగృహ మేనేజర్ శ్రీనివాస్, సామాజిక కార్యకర్త నరేష్‌కుమార్, శిశుగృహా ఎఎన్‌ఎం జ్యోతి పాల్గొన్నారు.