రంగారెడ్డి

ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చుడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 20: మేడ్చల్ డివిజన్ పరిధిలో ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ అధికారులు.. రైతులకు ఎరువులు విత్తనాల కొరత లేకుండా చుడాలని జిల్లా వ్యవసాయాధికారి జగదీశ్ సూచించారు. మంగళవారం పట్టణంలోని మేడ్చల్ డివిజన్ వ్యవసాయాధికారి కార్యాలయంలో సమీక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతు సమగ్ర సర్వేపై వివరాలను తెలుసుకున్నారు. రైతులకు తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్) వరి వంగడంపై సంపూర్ణ అవగాహన కలిపించాలని చెప్పారు. జూలై నెలలో నారు పోసుకునే విధంగా రైతులను చైతన్య పర్చాలని సూచించారు. లేనియేడల పంట ఎత్తుగా పెరిగి విరిగిపోయి రైతుకు నష్టం వాటిల్లే అవకాశముందని తెలిపారు. ఎరువుల నిల్వలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. ప్రస్తుతం ఎరువులు విత్తనాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు వివరించారు. కార్యక్రమంలో డివిజన్ ఎడిఎ శోభారాణి, మండల ఎఓ శైలజ, శామీర్‌పేట్ ఎఓ విజయలక్ష్మీ, కీసర ఎఓ కవిత, కుత్భుల్లాపూర్ ఎఓ మాధవరెడ్డి, గజలక్ష్మీ పాల్గొన్నారు.

చెత్తను విడదీద్దాం.. కుటుంబాలను కలుపుదాం!

ఉప్పల్, జూన్ 20: పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చని కాపురాలతో కళకళలాడాలన్నదే జిహెచ్‌ఎంసి లక్ష్యం. ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, మనస్పర్థలు, ఇతర కారణాల వల్ల విడిపోయిన భార్యాభర్తలను ఒక్కటి చేసేందుకు అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ‘చెత్తను విడదీద్దాం.. కుటుంబాలను కలుపుదాం’ అన్న నినాదంతో స్వచ్ఛంద సంస్థల సహకారంతో మంగళవారం జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లో నాలుగు జంటలను కలిపి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించి బజారున పడకుండా ప్రశాంత వాతావరణంలో పరిష్కరించుకుని సంతోషంగా ఉండాలే తప్ప ప్రతిదానికి బజారున పడి జీవితాన్ని బజారుపాలు చేసుకోవద్దని హితవుపలికారు. సిరిసంపదలు మంచితనాన్ని తీసుకురావని మంచితనం మాత్రమే అభిమానాన్ని, దీవెనలను తీసుకొస్తుందన్న విషయాన్ని మరువద్దన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ యాదగిరిరావు, ఎల్‌బినగర్ డిప్యూటీ కమిషనర్ విజయకృష్ణ, ప్రేరణ సంస్థ అధ్యక్షుడు ఇంజనీర్ గిరి, యుసిడి అధికారులు పాల్గొన్నారు.