రంగారెడ్డి

బాల్య వివాహాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మే 27: బాల్య వివాహాలు జరగకుండా ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ పి.సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అనంతగిరిలోని హరిత రిసార్ట్స్‌లో బాల్య వివాహాలను వ్యతిరేకిద్దాం, బాల్యాన్ని రక్షిద్దాం అనే అంశంపై చైల్డ్‌లైన్, ఎంవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల సదస్సు నిర్వహించారు.
సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలకు భయపడి తల్లిదండ్రులు ఆడపిల్లలను బడులకు పంపకుండా చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేస్తున్నారని చెప్పారు. ఆడపిల్లల విషయంలో పెళ్ళిఒక్కటే పరిష్కారమని తల్లిదండ్రులు భావించడం మూలాన అనేక సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. బాల్యంలోనే వివాహం చేస్తే ఆనారోగ్యాల పాలవుతారని అవగాహన కల్పించాలని, వయస్సుకు సంబంధించిన సర్ట్ఫికెట్ ఉంటేనే పెళ్ళికి అనుమతించేలా నిబంధన తేవాలని అభిప్రాయపడ్డారు. ఎన్నోకష్టాలు పడిచేసే పెళ్ళిని పెళ్ళిరోజు అపడం సరికాదని, ముందే వివరాలు తెలుసుకుని బాల్య వివాహం జరపకుండా నచ్చజెప్పాలని సూచించారు. 8,9 తరగతుల్లో చదువు ఆపే పిల్లల వివరాలను సేకరించాలని, అపుడే బాల్య వివాహాలను నిరోధించవచ్చని వివరించారు. కార్యక్రమంలో వికారాబాద్, చేవెళ్ళ ఎమ్మెల్యేలు బి.సంజీవరావు, కెయాదయ్య, ఎంవి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శాంత సిన్హా, ఎంవి ఫౌండేషన్ చీఫ్ కో ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపిపి, జడ్పీటిసి, ఎంపిటిసి, సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొనగా కార్యక్రమానికి చైల్డ్ జిల్లా కో ఆర్డినేటర్ వెంకటేశ్ అధ్యక్షత వహించారు.