రంగారెడ్డి

సామాజిక సేవా స్ఫూర్తి కలిగి ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మే 27: సామాజిక సేవా స్ఫూర్తి కలిగిన ప్రతి వ్యక్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాష్ట్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైకర్టర్ ఎన్.కృష్ణవేణి అన్నారు. మండల కేంద్రంలోని కేఎల్‌ఆర్ గార్డెన్‌లో జనచైతన్య సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్, మగ్గం వర్క్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశాన్ని సాంకేతిక రంగంలో ప్రపంచానికి ధీటుగా నిర్మించాలని భారత ప్రభుత్వం చర్యలు చేపడుతున్న తరుణంలో గ్రామీణ స్థాయి నుంచి సాంకేతిక రంగంపై ప్రతి ఒక్కరిని నిష్ణాతులను చేసేందుకు ఉచితంగా శిక్షణను ఇవ్వటం గర్హనీయమని అన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న మహిళలను పట్టించుకోని నేటి సమాజంలో ఎవరి మీద అధారపడి జీవించకుండా స్వయం ఉపాధిని కల్పించేందుకు సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. కుట్టు శిక్షణతో పాటు, కంప్యూటర్ శిక్షణ, మగ్గం వర్క్ లను ఉచితంగా నేర్పించి తర్ఫీదు పొందినట్లు అర్హత పత్రాలను అందించటం సేవా మార్గానికి నిదర్శనం అన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్ మాట్లాడుతు సేవా మార్గమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సామాజిక సేవను అలవర్చుకునేలా జనచైతన్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్బసాని యాదగిరి యాదవ్ మార్గ దర్శకుడు అయినట్లు తెలిపారు. ఘట్‌కేసర్ సర్పంచ్, జనచైతన్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్బసాని యాదగిరి యాదవ్ మాట్లాడుతు పేద ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేయాలనే ఆశయంతో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతన్నట్లు తెలిపారు. అణగారిన ప్రజలను అక్కున చేర్చుకుని వారికి బాసటగా నిలబడటమే లక్ష్యంగా తమ సంస్థ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఫిబ్రవరిలో తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమంలో 1000 మంది శిక్షణ పొందినట్లు తెలిపారు. మహిళల కోరిక మేరకు కుట్టు శిక్షణతో పాటు మెహింది డిజైనింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 35 బెడ్లు పంపిణీ చేశామని వెల్లడించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్ధులకు నగదు పురస్కారం ఇచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ అమర వీరుల స్మారకార్ధం వేసవి కాలంలో బస్టాండ్ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో, ఎర్రిమల్లే వాగు పరిసర ప్రాంతాలలో పారిశుద్ద కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఘట్‌కేసర్ వైస్ ఎంపిపి గ్యార లక్ష్మయ్య, ఏదులాబాద్ సర్పంచ్ మూసి శంకర్, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బైనగారి నాగరాజు, సింగిల్‌విండో మాజి చైర్మన్ సార శ్రీనివాస్‌గౌడ్, సంస్థ అధ్యక్షుడు అంకం రాజేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, రాంచందర్, పంచాయతీ సభ్యులు సోమసాని రమేశ్, దయ్యాల లలిత, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖయ్యూం పాల్గొన్నారు.