రంగారెడ్డి

నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో ఇండోర్ స్టేడియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 27: నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో ఇండోర్ స్టేడియాన్ని నిర్మించడానికి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా శుక్రవారం ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన శిక్షణ శిబిరం ముంగింపు వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. మానసిక ఉల్లాసం, శరీర దారుఢ్యంకోసం క్రీడలు ఎంతో దోహదపడుతాయని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరమని పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నాయని తెలిపారు. ఉప్పల్‌లో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం తరహాలో నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో అధునాతన స్టేడియంలను నిర్మించడానికి కృషి చేస్తానని తెలిపారు. రామంతాపూర్ ప్రజల సౌకర్యార్థం త్వరలో స్విమ్మింగ్‌పూల్‌ను నిర్మించడానికి స్థల సేకరణ జరుగుతుందని ప్రభాకర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి వేసవి శిక్షణ శిబిరాలతో పాటు సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించాలని జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. వివిధ క్రీడల్లో శిక్షణ ఇచ్చి విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న కోచ్‌లను అభినందించారు. ఎల్‌బినగర్ జోనల్ కమిషనర్ రఘుప్రసాద్ మాట్లాడుతూ ఈస్ట్ డివిజన్‌లోని అన్ని క్రీడా మైదానాల్లో సౌకర్యాలను కల్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ సర్కిల్ కార్పొరేటర్లు మేకల అనలారెడ్డి, గోపు సరస్వతి, బేతి స్వప్నరెడ్డి, గందం జ్యోత్స్న, డిప్యూటి కమిషనర్లు శ్రీనివాస్‌రెడ్డి, సరోజ, ఇఇ నాగేందర్‌యాదవ్, స్పోర్ట్స్ ఇన్‌చార్జిలు మన్యం, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులు నిర్వహించిన మార్చ్ఫాస్ట్ అందర్ని విశేషంగా ఆకట్టుకుంది. కాప్రా ప్రాంతంలోని విజయా హైస్కూల్ ప్రథమ స్థానంలో, కేంద్రీయ విద్యాలయం ఉప్పల్ ద్వితీయ స్థానంలో, మల్లాపూర్‌లోని ప్లేగ్రౌండ్‌కు చెందిన మార్షల్ ఆర్ట్స్ బాలురు తృతీయ స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకున్నారు. విజేతలైన విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రభాకర్, కార్పొరేటర్లు, అధికారులు జ్ఞాపికలను అందజేసి ఆశీర్వదించారు.