రంగారెడ్డి

పోలీసుస్టేషన్లలో ఎస్పీ తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోమిన్‌పేట/మర్పల్లి, మే 27: వికారాబాద్ సబ్ డివిజన్‌లోని పోలీసుస్టేషన్ల పనితీరును తెలుసుకునేందుకు, ధారూర్, బంట్వారం, మర్పల్లి, మోమిన్‌పేట పిఎస్‌లను సందర్శించినట్లు రూరల్ ఎస్పీ నవీన్‌కుమార్ అన్నారు. శుక్రవారం మోమిన్‌పేట పోలీసుస్టేషన్‌ను సందర్శించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ప్రజలతో పోలీసులు వ్యవహరించే తీరు, రికార్డులు ఎలా ఉన్నాయి.. స్టేషన్‌కు వచ్చేవారితో పోలీసులు మర్యాదగా మాట్లాడుతున్నారా.. స్టేషన్‌కు వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజలకు కలిగేలా చూస్తారా లేదా.. కేసులు ఎలా వున్నాయి పరిశీలించానని అన్నారు. 174 కేసులు మాత్రమే ఉన్నాయని, పెద్ద కేసులు ఏమీ లేవు చిన్న చిన్న తగాదాలకు, ఆత్మహత్యలకు పాల్పడిన వంటివి ఉన్నాయని అన్నారు.
మూఢనమ్మకాలు, బాణామతి, చేతబడి వంటివాటిపై ప్రజల్లో మరింత అవగాహన వచ్చేందుకు కళాజాత ప్రదర్శనలతో చైతన్యం తీసుకువస్తామని పేర్కొన్నారు. రాష్ట్రావతరణ వేడుకలకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. పోలీసుస్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారునికి న్యాయం జరిగితేనే ప్రజల్లో పోలీసులపట్ల నమ్మకం కలుగుతుందని చెప్పారు. జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. వికారాబాద్ డిఎస్పీ టి.స్వామి, సిఐ ఎవి రంగ, ఎస్‌ఐ రాజు పాల్గొన్నారు.