రంగారెడ్డి

పట్టణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలను కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అర్బన్ డే సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, పింఛన్ల పంపిణీ, పారిశుద్ధ్యం తదితర అంశాలపై దృష్టి సారించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా ఏర్పడ్డ మీర్‌పేట్, జిల్లెలగూడ, జల్‌పల్లి, బోడుప్పల్, ఫీర్జాదిగూడ మున్సిపాలిటీల్లో అక్రమ భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలో అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పెన్షన్‌లు సక్రమ పంపిణీకి ఆయా మున్సిపాలిటీల్లో బిల్‌కలెక్టర్‌లు పోస్ట్ఫాసులతో సమన్వయంగా ఉండి చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించారు.
వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీలతో పాటు మేడ్చల్, పెద్దఅంబర్‌పేట్, బడంగ్‌పేట్, ఇబ్రహీమ్‌పట్నం నగర పంచాయతీల్లో తాగునీటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.
జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయా మున్సిపాలిటీల పరిధిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పండ్లు, స్వీట్‌లు పంపిణీ చేయాలని, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ కమీషనర్‌లను ఆదేశించారు. జిల్లా స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలను వికారాబాద్‌లో సాయంత్రం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో వికారాబాద్, తాండూరు మున్సిపల్ చైర్మన్‌లు సత్యనారాయణ, విజయలక్ష్మి, డిఆర్‌డిఎ పిడి సర్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.