రంగారెడ్డి

భర్తను కొట్టి భార్యపై అత్యాచారయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, జూన్ 17: భర్తను కొట్టి అతను చూస్తుండగానే భార్యపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచార యత్నం చేసిన సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. మెదక్ జిల్లా కోహినూర్ మండలానికి చెందిన సీత, భర్త యాదగిరి, కూతురు పరిగి కేంద్రంలోని తమ బంధువుల ఇంటిదగ్గర ఫంక్షన్‌కు వచ్చారు. పరిగిలో ఫంక్షన్ అయిన తరువాత గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కారుపై సీత, భర్త యాదగిరి, కూతురు హైద్రాబాద్ వెళ్తుండగా, రంగాపురం స్టేజి సమీపంలోకి రాగానే యాదగిరికి నిద్ర వచ్చింది. స్టేజి దగ్గర హైద్రాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై రోడ్ కిందకు కారును దించి కారులోనే సీత, యాదగిరి, వారి కూతురు పడుకున్నారు. రాత్రి పెట్రోలింగ్‌కు వెళ్లిన పోలీస్‌లు అది గమనించి కారు దగ్గరికి వెళ్లి, ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడికి పోవాలి అంటూ వారిని నిలదీసి అడిగారు.
పరిగిలోని వారి బంధువుల దగ్గరికి వచ్చి వెళుతున్నామని, ఇక్కడికి వచ్చిన తరువాత నిద్రరావడంతో కారులోనే పడుకున్నామని చెప్పారు. దీంతో పెట్రోలింగ్ పోలీసులు వెళ్లి పోయారు.
మరో అరగంట తరువాత ఓ ఇండికా కారు వచ్చి కారు పక్కన ఆగింది. తాము పోలీసులమని, మీ బండి పేపర్లు ఎక్కడ ఉన్నాయి అంటూ అడిగి పేపర్లు తీసుకున్నారు. కారు తాళంచెవి ఇవ్వమని అడిగారు. యాదగిరి తాళం చెవి ఇవ్వకపోవడంతో అతనిపై చెయ్యి చేసుకున్నారు. సీత చెయ్యి పట్టుకుని లాగి కారులోకి లాగారు. నీ భర్తను వదిలి పెట్టాలంటే తమ కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో యాదగిరి వారి కాళ్లు పట్టుకుని తన భార్యను వదలి పెట్టమని బతిమలాడాడు. దాంతో వారు సీతను వదలి పెట్టారు కాని కారు పేపర్లు ఇవ్వలేదు. తర్వాత యాదగిరి రంగాపూర్ నుంచి పరిగి వచ్చి వారి బంధువులకు జరిగింది చెప్పాడు. రంగంలోకి దిగిన పోలీస్‌లు రంగాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ నాగేష్ తెలిపారు.