రంగారెడ్డి

అవినీతికి పాల్పడుతున్న బిల్‌కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జూన్ 17: నకిలీ రశీదులు ఇచ్చి అవినీతి పాల్పడుతున్న బిల్‌కలెక్టర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఘట్‌కేసర్ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ కోరారు. కలెక్టర్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సర్పంచ్ యాదగిరియాదవ్ వివరాలు తెలిపారు. ఘట్‌కేసర్ పంచాయతీ పరిధిలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరుగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తుండగా ఎవరికీ అనుమానం రాకుండా పంచాయతీ కార్యాలయంలో పని చేస్తున్న బిల్‌కలెక్టర్లు నకిలీ రశీదులు ఇచ్చి డబ్బులు కాజేసినట్లు తెలిపారు. గతంలో నకిలీ రశీదులు ఇచ్చి పంచాయతీ డబ్బులు కాజేసినట్లు అధారాలతో సహా రుజువు చేసినప్పటికీ అధికారులు కనీస చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పంచాయతీ పరిధిలోని ప్రజలు చెల్లించే ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, ఇతర జమ ఖర్చుల చెల్లింపులకు యిచ్చే రషీదులకు బదులు నకిలీ రషీదులను తయారు చేసుకుని పంచాయతీ డబ్బులను యథేచ్ఛగా కాజేస్తున్నట్లు ఆరోపించారు. పంచాయతీ కార్యాలయంలో బిల్‌కలెక్టర్‌గా పని చేస్తున్న రమేశ్ కొంత కాలంగా రెండు లక్షల రూపాయలను జమ చేయకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు తెలిపారు. అప్పటి కార్యదర్శి నిర్లక్ష్యం వల్లనే పంచాయతీ నిధులు పక్క దారి పట్టినట్లు ఆరోపించారు. అవినీతి, అక్రమాలకు తావీవ్వకుండా పరిపాలన అందించాలనే లక్ష్యంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తుండగా తన కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది యదేచ్ఛగా అవినీతి పాల్పడటం దురదృష్టకరమని చెప్పారు. ఇంటి దొంగలను రెడ్ హండెడ్‌గా పట్టుకుని రుజువులు చూపిన చర్యలు తీసుకోవటంలో అధికారులు కొంత మంది రాజకీయ నాయకులు వత్తిడితో వెనుకడుగు వేస్తున్నట్లు ఆరోపించారు. సర్పంచ్ యాదగిరి యాదవ్‌తో పాటు పంచాయతీ సభ్యులు బూరుగు చంద్రశేఖర్‌గుప్త ఉన్నారు.