రంగారెడ్డి

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జూన్ 17: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని మల్కాజ్‌గిరి ఎంపి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం దమ్మాయిగూడ గ్రామంలోని తిరుమల, సాయి తిరుమల ఎన్‌క్లేవ్ కాలనీలో 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దమ్మాయిగూడ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ అయినందున ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయని అందువల్ల ఎవరి సహాయ సహకారాలు లేకుండానే గ్రామాన్ని అభివృద్ధి చేసుకొనే సత్తా సర్పంచ్ అనూరాధకు ఉందని పేర్కొన్నారు. కాలనీ అసోషియేషన్ నాయకులు కొంత సొమ్మును కలిపినట్లయితే ఎంపి, ఎంఎల్‌ఏ ఫండ్ కలిపి వౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం మేడ్చల్ ఎంల్‌ఏ ఎం.సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ కేసిఆర్ ప్రభుత్వం మిషన్ భగీరధ కింద జూలై నుండి తాగునీరు మేడ్చల్, కీసర, శామీర్‌పేట్, ఘట్‌కేసర్, ఉప్పల్ మండలాలకు అందించనున్నట్టు పేర్కొన్నారు. ప్రతి చిన్న విషయానికి తనను సంప్రదించకుండా కాలనీవాసుల సహాయ సహకారాలతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఎంపి నిధులు 10 లక్షలు గ్రామ పంచాయతీ నిధులు ఐదు లక్షల రూపాయలతో ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులు చేపట్టడం ద్వారా మంచినీటి సమస్యలు తీరతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. అలాగే సంప్ నిర్మాణానికి నిధులు కేటాయించ వల్సిందిగా సర్పంచ్ అనూరాధ ఎంఎల్‌ఏ సుధీర్‌రెడ్డిని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి సుజాత, వైస్‌ఎంపిపి స్వప్న, ఎంపిడిఓ వినయ్‌కుమార్, జెడ్‌పిటిసి రమాదేవి, ఎంపిటిసిలు భాస్కర్, శ్రీహరిగౌడ్, నవనీత, నాయకులు రవికాంత్, పి. యాదగిరి, కార్తీక్‌గౌడ్, సాయిగౌడ్, కిరణ్, అఖిల, కళావతి పాల్గొన్నారు.