రంగారెడ్డి

క్యాన్సర్ పరీక్షా శిబిరానికి అనూహ్య స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 17: అఖిల భారత మార్వాడీ యువమంచ్ మేడ్చల్ శాఖ వారి ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలోని ప్రభుత్వ పౌర ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరానికి ప్రజల నుంచి అనుహ్యమైన స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. సుమారు రూ.10వేల వరకు వివిధ రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించే శిబిరాన్ని స్థానిక సిఐ రాజశేఖర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ ముఖ్యఅతిథిలుగా విచ్చేసి ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థలు నిరుపేదలకు మేలు చేసేటటువంటి ఉచిత పరీక్షా శిబిరాలు ముఖ్యంగా ప్రాణాంతకమైన క్యాన్సర్ మహమ్మరిలాంటి వ్యాధులను గుర్తించే అతి ఖరీదైన పరీక్షలను ఉచితంగా నిర్వహించడం అభినందనీయమని కొనియడారు. దాదాపు వివిధ రకాలకు సంబంధించిన రూ. 10వేలు విలువజేసే వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం ముదావహమని పేర్కొన్నారు. ఉచిత పరీక్షా శిబిరంలో 167 మంది వివిధ రకాల పరీక్షలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం కూడా ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు, ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు భాస్కర్, విష్ణుచారి, మోనార్క్, శేఖర్‌గౌడ్, రఘు, ఆజ్మత్‌ఖాన్, మేడ్చల్ మార్వాడీ యువమంచ్ అధ్యక్షుడు కైలాష్ ప్రజాపతి, కార్యదర్శి బికారాం గుజ్జర్, కోశాధికారి మాంగీలాల్ సిర్వి, క్యాంప్ చైర్మన్ మధన్‌లాల్ ప్రజాపతి, వాలంటీర్ అంద్రెల్లి సంధ్య పాల్గొన్నారు.