రంగారెడ్డి

ఆర్యోగ వరప్రదాయిని యోగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 17: యోగ ఆరోగ్య వరప్రదాయిని అని నిత్య యోగాతో చాలా రోగాలు దరి చేరకుండా ఉంటాయని యోగ శిక్షకులు యశ్‌పాల్ ఆర్య అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగ గురువు రామ్‌దేవ్ బాబ పిలుపు మేరకు మేడ్చల్ పట్టణంలోని లక్ష్మమ్మ స్మారక విద్యానిలయంలో ఐదు రోజుల యోగ శిక్షణా తరగతుల్లో భాగంగా శుక్రవారం మొదటి రోజు యోగ శిక్షణ తరగతులను ఆర్య ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. సర్వేజన సుఖిన భవంతు అను వేద వాక్యం అనుసారంగా ప్రజలందరూ సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఉదయం యోగ సాధన కోరకు కనీసం ఒక గంటసేపు కేటాయించాలని కోరారు. అందరూ చేయగల సరళతరమైన అసనములు తోడాసనము, కటి చక్రాసనము, సూర్యసమస్కారాలు, మండూకాసానము, శశీఖాసనము, వక్రాసనము, మర్కటాసనము, ప్రాణాయామలను నేర్పించారు. సహజంగా వచ్చే చిన్న చిన్న రోగాలతో పాటు తీవ్ర సమస్యలైన క్యాన్సర్, గుండెసమస్యలు, మహిళా సమస్యలు తోలగిపోతాయని వివరించారు. రిటైర్డ్ ట్రాన్స్‌కో ఎడి నాగభూషణం మాట్లాడుతూ ఈనెల 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని శ్రీనివాస కల్యాణ మండపం నిర్వహించనున్న యోగ దినోత్సవానికి అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యోగ శిక్షకులు వెంకటరమణ, కిషోర్, ప్రవీణ్, శ్రీనివాస్, లక్ష్మన్ యాదవ్, వేణుగోపాల్, ప్రభావతి, మమత, ప్రవీణ, రోజారాణి పాల్గొన్నారు.