రంగారెడ్డి

స్కూల్ బస్సు ఢీకొని బాలుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 17: అవగాహన లేని ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌ల నిర్లక్ష్యంతో చిన్నపిల్లలు బలవుతున్నారు. ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ బాలుడు దుర్మరణం పాలైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన రాంరెడ్డి, సుశీల దంపతులకు ఓ బాబు, ఓ కూతురు సంతానం. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి చింతల్, ప్రసూన నగర్‌లో నివాసముంటున్నారు. జీడిమెట్లలోని రెడ్డీస్ ల్యాబరేటరీస్ పరిశ్రమలో ఆపరేటర్‌గా రాంరెడ్డి ఉద్యోగం చేస్తుంటాడు. ఇతని కుమారుడు యశ్వంత్‌రెడ్డి (6) చింతల్, వివేకానందనగర్ కాలనీలోని విజ్ఞాన్ సుధా ట్యాలెంట్ స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్నాడు. గత సంవత్సరం వేరొక పాఠశాలలో చదివిన యశ్వంత్‌రెడ్డి ఈనెల 13న విజ్ఞాన్ సుధా స్కూల్‌లో జాయిన్ చేశారు. శుక్రవారం ఉదయం సుమారు 8.30 గంటల ప్రాంతంలో తండ్రి రాంరెడ్డి యశ్వంత్‌రెడ్డిని పాఠశాలలో దింపి ఉద్యోగానికి వెళ్లాడు. అదే పాఠశాలకు చెందిన ఎపి 28 టిఎ 3437 నంబరు గల బస్సు డ్రైవర్ శ్రీశైలం యశ్వంత్‌రెడ్డిని చూసుకోకుండా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఢీకొట్టాడు. తీవ్ర గాయాలకు గురైన యశ్వంత్‌రెడ్డిని స్థానికులు, తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఉద్యోగానికి వెళ్లిన రాంరెడ్డి కుమారుని ప్రమాద వార్త ఫోన్‌లో తెలియడంతో పరిశ్రమలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాల యాజమాన్యం, అవగాహన లేని డ్రైవర్‌ల నిర్లక్ష్యం కారణంగానే తన కుమారుడు మృతి చెందాడని, తన బాబును తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు రోదించారు. పాఠశాల యాజమాన్యాన్ని, బస్సు డ్రైవర్‌ను కఠినంగా శిక్షించి మరొకరికి ఇలాంటి దుస్థితి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, బస్సు డ్రైవర్ శ్రీశైలంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.