రంగారెడ్డి

రైతు అభివృద్ధికి విస్తరణ విభాగం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూలై 4: రైతు అభివృద్ధికి విస్తరణ విభాగం ఎంతో కీలకమైందని జాతీయ వ్యవసాయ విస్తరణ సంస్థ డైరెక్టర్ జనరల్ ఉషారాణి అన్నారు. సోమవారం రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో యువ విస్తరణ శాస్తవ్రేత్తలకు ‘శాస్ర్తియ పరిశోధన’ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు ప్రారంభమైంది. తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, కర్నాటక పశువైద్య విశ్వవిద్యాలయం, ఇండియన్ వెటర్నరీ ఎక్స్‌టెన్షన్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పశువైద్య ఆసుపత్రులు కేవలం చికిత్స వరకే పరిమితం కాకుండా రైతులకు సమాచారం అందించే పశువైద్య విస్తరణ కేంద్రాలుగా మార్చనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని పశువైద్య ఆసుపత్రులను ఎంపిక చేశామని తెలిపారు.
సమగ్ర వ్యవసాయ విధానాలతో రైతు ఆత్మహత్యలు కొంత వరకు అరికట్టవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనా ఫలితాలను రైతులకు అందించేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు. లక్ష మంది రైతులతో మేనేజ్ సంస్థ ఫేస్‌బుక్‌ను రూపొందించిందని ఇప్పటి వరకు 80 వేల మంది రైతులు చేరారని తెలిపారు. దేశావళి పశుసంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత పశువైద్య శాస్తవ్రేత్తలపై ఉందని, ఆ దిశలో శాస్తవ్రేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పశుపోషణ విభాగంలో మహిళా రైతుల పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. కార్యక్రమంలో ఇండియన్ వెటర్నరీ ఎక్స్‌టెన్షన్ ఫోరం అధ్యక్షుడు కుమార్, వెటర్నరీ వర్సిటీ రిజిస్ట్రార్ కే.కొండల్ రెడ్డి, డీన్ రవీందర్‌రెడ్డి, రమేష్‌గుప్త, డాక్టర్ సిఎ సత్యనారాయణ, ప్రకాష్‌కుమార్ రాథోడ్, వీరన్న, మహారాష్ట్ర, సిక్కిం, కర్నాటక రాష్ట్రాలకు చెందిన యువ విస్తరణ శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు. సదస్సుకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.