రంగారెడ్డి

హైకోర్టు విభజనతోనే తెలంగాణ న్యాయాధికారులకు న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్‌బినగర్, జూలై 4: ఉమ్మడిగా ఉన్న హైకోర్టును విభజించడంతోనే తెలంగాణ న్యాయాధికారులకు, న్యాయవాదులకు న్యాయం చేకూరుతుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా ఎల్‌బినగర్ నియోజకవర్గం పరిధిలోని రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయ శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన దీక్ష చేపట్టారు. సోమవారం జరిగిన సభలో న్యాయ శాఖ ఉద్యోగులకు మద్దతుగా హోంశాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్‌బినగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లేష్, చేవెళ్ల కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.కార్తీక్‌రెడ్డి హాజరయ్యారు.
రాజ్యాంగ బద్ధంగా న్యాయశాఖ ఉద్యోగులు తమ హక్కులను సాధించడం కోసం పోరాటాలు చేపడతుంటే వారిని బహిష్కరించడం బాధకరమైందని అన్నారు. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు అందరికీ న్యాయం చేకూరాలని ఆనాడు ఉద్యమాలు చేస్తే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అందించారని గుర్తు చేశారు. కానీ, ఇనాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వైఖరితో తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. స్వరాష్ట్రంలోనూ మా ఉద్యోగాలు, మా హక్కులు మాకు కావాలని పోరాటాలు చేయాల్సిన దుర్భర పరిస్థితికి రావడం శోఛనీయమని అన్నారు. తెలంగాణ న్యాయాధికారులు, న్యాయవాదులకు అన్యాయం జరుగకుండ హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు.
న్యాయశాఖ ఉద్యోగులకు మద్దతు తెలిపినవారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, బాగ్ కౌన్సిల్ సభ్యుడు అనంతసేనారెడ్డి, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
20 లీటర్ల నీటిని 10 రూపాయలకే అమ్మాలి
శంషాబాద్, జూలై 4: శంషాబాద్ పంచాయతీ పరిధిలోగల వాటర్ ఫిల్టర్స్ నిర్వహిస్తున్న 10 రూపాయలకే 20 లీటర్ల నాణ్యతగల మంచినీటిని సరఫరా చేయాలని లేనిచో కఠిన చర్యలు తప్పవని పంచాయతీ సిబ్బంది ఆదేశాలు జారీచేశారు. సోమవారం శంషాబాద్ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న పలు వాటర్ ఫిల్టర్స్‌లను ఇఓ యాదగిరిరెడ్డి, సిబ్బంది బాబు తదితరులు పరిశీలించచారు. ఈ సందర్భంగా ఇఓ యాదగిరి రెడ్డి, బాబులు మాట్లాడుతూ వాటర్ ఫిల్టర్‌లను నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు 20 లీటర్ల నీటిని 10 రూపాయలకే నాణ్యతతో ఇవ్వాలని, లేని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయించినా, మంచినీరు మంచిగా లేవని ఎవరైనా ఫిర్యాదు చేసినా ఆ వాటర్ ఫిల్టర్‌ను సీజ్ చేస్తామన్నారు.