రంగారెడ్డి

మొక్కలు నాటడం మనందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి: కాలుష్యాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అప్పారావు అన్నారు. సోమవారం డొయన్స్ కాలనీలోని విద్యాంజలి హైస్కూల్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌తో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని గిన్నిస్ బుక్‌లో నమోదు అయ్యేలా కృషి చేయాలని కోరారు.
విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, మియాపూర్ కార్పొరేటర్ మేక రమేష్, జిహెచ్‌ఎంసి వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ బివి గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి సర్కిల్ 11 ఉప కమిషనర్ వివి మనోహర్, ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ లేగల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.