రంగారెడ్డి

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఏప్రిల్ 15: అనుమానాస్పద స్థితిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బహుళ అంతస్థుల భవనంపై నుండి పడి మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి సంస్కృతి టౌన్‌షిప్‌లో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. ఘట్‌కేసర్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సంస్కృతి టౌన్‌షిప్‌లోని బ్లాక్ సి-9 పది అంతస్తుల భవనం పై నుండి కింద పడి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందినట్లు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘట్‌కేసర్ సిఐ బి ప్రకాష్ సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌ను రప్పించారు. మృతుడు ఎక్కడ పనిచేస్తున్నాడు వివరాలు లేకపోవటంతలో స్థానికంగా ఉన్న ఇన్ఫోసిస్, జన్‌ప్యాక్, ఇన్‌వెంచర్స్, యాక్సిస్ బ్యాంక్‌లలో మృతుని వివరాలకు అరా తీశారు. మృతుని వివరాలు లభ్యం కాలేదు. మృతుడు పది అంతస్థుల భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవటం గాని, ఎవరైన కిందకు తోసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని చెప్పులు భవనం పైన ఉండటంతో తానే స్వయంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తెలిపారు. అతనికి సంబంధించి వివరాలు లభ్యం కాక పోవటం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. మృతునికి సంబంధించి సెల్‌ఫోన్ గాని, గుర్తింపు కార్డులు గాని లభ్యం కాలేదని, కనీస సమాచారం చెప్పేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఏ బ్లాక్‌లో ఉంటున్నాడు, ఎక్కడ పని చేస్తున్నాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి వేలి ముద్రలు తీసుకుని అయా కంపెనీలలో విచారణ జరిపినప్పటికీ పలితం లేక పోవటం పోలీసులకు సవాలుగా మిగిలింది. మృతుడు హత్యకు గురయ్యాడా, ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయమై పోలీసులు నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సిఐ బి.ప్రకాష్ చేసిన ప్రయత్నం ఫలించలేదు, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నగరంలోని గాంది ఆస్పత్రికి తరలించి, సంస్కృతి టౌన్‌షిప్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు సిఐ ప్రకాష్ తెలిపారు.