రంగారెడ్డి

బాచుపల్లి పాలకవర్గంలో మరోసారి భగ్గుమన్న విభేదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 17: బాచుపల్లి పాలకవర్గంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. పంచాయతీ ఎన్నికలు జరిగి ప్రమాణ స్వీకారం మొదలు వార్డు సభ్యులకు, సర్పంచ్, ఎంపిటిసిల మధ్య వివాదం జరుగుతూనే ఉంది. ఈమధ్య కాలంలో మూడు పాలకవర్గ సమావేశాలు కాస్త సజావుగా జరగడంతో వీరి మధ్య సయోధ్య కుదిరిందని అందరూ భావించారు. కాని మళ్లీ మొదటికి వచ్చింది. ఆదివారం బాచుపల్లి గ్రామం, రేణుక ఎల్లమ్మ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హరిత హారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీ అసోసియేషన్ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్, ఎంపిపి కవిత, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపిటిసిలకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే వివేక్, ఎంపిపి కవిత, వైస్ ఎంపిపి కృష్ణారెడ్డి, సర్పంచ్ ఆగం పాండు, ఉపసర్పంచ్ సయ్యద్ సలీమ్‌లు హాజరయ్యారు. మొక్కలు నాటే కార్యక్రమం అనంతరం కాలనీలో పూర్తికాని సిసి రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టాలని కాలనీ వాసులు అతిథులను కోరారు. దీంతో రోడ్డు పనులను ప్రారంభించడానికి ఎమ్మెల్యే కెపి వివేక్, ఎంపిపి కవిత, సర్పంచ్ ఆగం పాండులతో పాటు ఉపసర్పంచ్ సలీమ్, వార్డు సభ్యులు అక్కడికి వచ్చారు. వచ్చిరాగానే పంచాయతీ నిధులతో రోడ్డు పనులను ప్రారంభిస్తే తమకు సమాచారం ఇచ్చేది లేదా తీర్మానం చేయకుండా ఏ విధంగా పనులను ప్రారంభిస్తారని ఉపసర్పంచ్ సలీమ్ సర్పంచ్‌ను ప్రశ్నించారు. రోడ్డు పనుల ప్రారంభ విషయం తనకు కూడా తెలియదని, కాలనీకి ఎమ్మెల్యే, ఎంపిపి వచ్చినందున కాలనీవాసులు సంతోషంతో రోడ్డు పనులను ప్రారంభించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, తీర్మానాలు లేకుండా ఏ పనులు చేయడం లేదని సర్పంచ్ పాండు అన్నారు. పాలకవర్గం సభ్యులకు తెలియకుండా ఏ విధంగా అభివృద్ధి పనులను చేపడతారని సలీమ్ అడిగాడు. ప్రొటోకాల్ పాటించకుండా అంటే తీస్తే అన్ని గోతులు బయటపడతాయని సర్పంచ్ పాండు అన్నారు. విలువ లేకుండా తాము మాట్లాడలేమని వార్డు సభ్యులకు ఏ రకంగా సహకరిస్తున్నామో సభ్యులకు తెలియదా అని సర్పంచ్ ప్రశ్నించాడు.
సర్పంచ్, ఉపసర్పంచ్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే కెపి వివేక్ కలుగజేసుకుని హరితహారం కార్యక్రమానికి వచ్చిన తాము అందరి సహకారంతో రోడ్డు పనులను ప్రారంభించుకుందామా లేక వెళ్లిపోదామా అని ప్రశ్నించడంతో పనులను ప్రారంభించాలని సభ్యులంతా చెప్పారు. రోడ్డు పనులకు టెంకాయ కొట్టిన ఎమ్మెల్యే వివేక్ వెళ్లిపోయారు. ఏదిఏమైనప్పటికీ బాచుపల్లి పాలకవర్గం సభ్యుల్లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయని చెప్పక తప్పదు.