రంగారెడ్డి

కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జూలై 17: కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కీసరలోని లలితా ఫంక్షన్‌హాల్‌లో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం టిఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు కె.అయిలయ్య అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా నాయిని నర్సింహారెడ్డి హాజరై మాట్లాడుతూ భవన నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే గత ప్రభుత్వాలు మూడు లక్షలు చెల్లించే వారని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక దానిని ఆరు లక్షలకు పెంచామని అన్నారు. ప్రతి కార్మికుడు తప్పనిసరిగా సంఘంలో సభ్యత్వం చేయించుకోవాలని కోరారు. సభ్యత్వం లేని కార్మికులకు ఎలాంటి నష్ట పరిహారం అందదని తెలిపారు. మేడ్చల్ ఎంఎల్‌ఎ ఎం.సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ రంగాల కార్మికుల పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని చెప్పారు. అనంతరం ప్రమాదవశాత్తు మరణించిన కార్మిక బాధిత కుటుంబీకులకు నాయిని చెక్కులను అందజేసారు. కార్యక్రమంలో సర్పంచ్ సిహెచ్ గణేశ్, ఉప సర్పంచ్ ఆర్.శ్రావణ్ గుప్తా, ఎంపిపి ఆర్ సుజాత ఎంపిటిసిలు బి.రమేశ్‌గుప్తా, జంగయ్య యాదవ్, కార్మిక సంఘం నాయకులు మెరుగు యాదగిరి, శ్రీనివాస్‌రెడ్డి, డి.చంద్రం, ఎ.ఎల్లయ్య, పి.సూర్యం, బి.దశరథం, ఎం.రాజన్న, బి.హన్మంతు, ఇ.లక్ష్మయ్య, సిహెచ్ మల్లేశం, బి. గంగాధర్, ఎం.లక్షీనారాయణ, మంచాల పాపయ్య, పి.హరిశ్చంద్ర, జి.వెంకటయ్య, ఆర్.రాజయ్య, ఎం.కృష్ణ, జి.మహేందర్, యు.శ్రీనివాస్ పాల్గొన్నారు.