రంగారెడ్డి

‘కబాలి‘ సినిమా థియేటర్లపై ఎస్‌ఓటి పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూలై 22: సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ ఎస్‌ఓటి పోలీసులు కబాలి ఆడుతున్న సినిమా థియేటర్లపై దాడి చేసి బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్ పరిధిలోని సైబరాబాద్ అడిషనల్ డిసిపి రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఓటి బృందాలు దాడులు చేశారు. ఎల్‌బి నగర్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, కుషాయిగూడ, ఉప్పల్, వనస్థలి పురంలోని పలు సినిమా థియేటర్లపై దాడులు చేసి 126 టికెట్లతో పాటు 11వేల 640 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కబాలి సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని ఆయా పోలీస్‌స్టేషన్లలో అప్పగించారు.
సైబరాబాద్ వెస్ట్ కమిషనరేట్ పరిధిలో ఎసిపి గంగాధర్ ఆధ్వర్యంలో కబాలి థియేటర్లపై దాడులు నిర్వహించారు. శంషాబాద్, చందానగర్, కెపిహెచ్‌బి, మియాపూర్, కాటేదాన్‌లలో గల కబాలి రిలీజైన సినిమా హాల్స్‌లో బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 63 టికెట్లను, 18 ఆన్‌లైన్ టికెట్లను సీజ్ చేయడంతో పాటు 1890 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లలో అప్పగించారు. ఈ దాడులు కొనసాగుతుంటాయని పోలీసు అధికారులు తెలిపారు.