రంగారెడ్డి

నగరంలో ప్రయాణం...సముద్రంలో ఈదినట్టుగా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జూలై 22: హైదరాబాద్‌లో ప్రయాణం చేయాలంటే సముద్రం ఈదినట్టుగా ఉంది...నగరంలో రోడ్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా...హైటెక్ సిటీ నుంచి శేరిలింగంపల్లిలోని జిహెచ్‌ఎంసి వెస్ట్‌జోన్ ఆఫీసుకు చేరుకోవడానికి రెండు గంటలు పట్టింది...రోడ్లను బాగుచేయాల్సిన అవసరం ఉంది...ఈ మాటలు అన్నది ఎవరో ప్రతిపక్ష నేత అనుకుంటే పప్పులో కాలేసినట్టే. స్వయాన మన నగర ప్రథమ పౌరుడు బొంతు రామ్మోహనే. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వివరాలలోకి వెళితే...జిహెచ్‌ఎంసిలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన పశ్చిమ మండలంలో హరితహారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించడానికి శుక్రవారం శేరిలింగంపల్లిలోని జోనల్ కమిషనర్ ఛాంబర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం అయిదు గంటలకు మీటింగ్ ఉందని ప్రజా ప్రతినిధులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో సహా వెస్ట్‌జోన్ పరిధిలోని మొత్తం 21మంది కార్పొరేటర్లు ఇక్కడికి చేరుకున్నారు.
ఏడున్నర గంటల సమయంలో వచ్చిన మేయర్ విలేఖరులతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.
హరితహారం ప్రతిష్టాత్మకం
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని నిర్వహిస్తున్నామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. ప్రభుత్వ భూములు, జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధించిన స్థలాల్లో భారీ సంఖ్యలో మొక్కలు నాటుతామని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేశామన్నారు. రోడ్ల పరిస్థితిని మెరుగుపరుస్తామని మేయర్ హామీ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో శేరిలింగంల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు వి.జగదీశ్వర్‌గౌడ్, రాగం నాగేందర్‌యాదవ్, బొబ్బ నవతరెడ్డి, సాయిబాబా, హమీద్‌పటేల్, మేక రమేష్, వి.పూజిత, వి.సింధు ఆదర్శరెడ్డి, శంకర్‌యాదవ్, శ్రీనివాస్‌రావుతో సహా 21మంది హాజరయ్యారు. ఇందులో జోనల్ కమిషనర్ బివి గంగాధర్‌రెడ్డి, శేరిలింగంపల్లి సర్కిల్ 11 ఉప కమిషనర్ వివి మనోహర్, సర్కిల్ 12 ఉప కమిషనర్ వి.మమత, రామచంద్రాపురం-పటాన్‌చెరు సర్కిల్ 13 ఉప కమిషనర్ విజయ్‌కుమార్, కూకట్‌పల్లి సర్కిల్ 14ఎ ఉప కమిషనర్ నరేందర్‌గౌడ్, సర్కిల్ 14బి ఉప కమిషనర్ రవీంద్రకుమార్, జోనల్ ఎస్‌ఇ మోహన్‌సింగ్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, అర్బన్ బయోడైవర్సిటీ, ఇతర అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రభూమి బ్యూరో