రంగారెడ్డి

ర్యాగింగ్ చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఆగస్టు 4: ర్యాగింగ్‌లకు పాల్పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సైబరాబాద్ ఈస్ట్ సిపి మహేష్‌భగవత్ అన్నారు. మండల పరిధి యంనంపేట్ గ్రామంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఓరియంటేషన్, యాంటీ ర్యాంగింగ్, డ్రంకన్ డ్రైవ్‌లపై అవగాహన కార్యక్రమం జరిగింది. విద్యార్థినీ విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటు సరదా కోసం ర్యాగింగ్‌లకు పాల్పడి తమ ఉజ్వల భవిష్యత్‌ను స్వయంగా నాశనం చేసుకుంటున్నారన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని సాధించే వరకు నిరంతరం కృషి చేయాలన్నారు. విద్యార్థినీ విద్యార్థులు సోదర భావంతో మెలగాలని, ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తూ మంచి నైపుణ్యతను సాధించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. ర్యాగింగ్‌లకు పాల్పడి కేసులు నమోదు అయితే కేంద్ర, రాష్ట్ర సర్వీసులతో పాటు విదేశీయానంలకు బ్రేక్ పడుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశమే లేదన్నారు. ఉన్నత చదువులు చదివి ప్రపంచ స్థాయి గుర్తింపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నూతనంగా కళాశాలలో చేరుతున్న విద్యార్థినీ విద్యార్థుల పట్ల సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు, కేసులు నమోదు చేస్తామన్నారు. మహిళల పట్ట ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, ర్యాగింగ్‌లకు పాల్పడిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, షీ టీమ్‌లు పది నిమిషాలలో రంగప్రవేశం చేసి నిందితులను అదుపులోకీ తీసుకుని చర్యలు తీసుకుంటాయన్నారు. ప్రతి ఒక్కరూ క్రమ శిక్షణతో మెలుగుతూ శాస్త్ర, సాంకేతిక రంగంలో రాణించి అత్యున్నత స్థానాలకు ఎదగాలని సిపి మహేష్‌భగవత్ సూచించారు.
విద్యార్థులు సరదా కోసం మద్యం సేవించి తమ ఇష్టానుసారం వాహనాలను నడుపుతున్నారని చెప్పారు. దీంతో ప్రమాదాలకు గురవ్వటంతో పాటు ఇతరుల మృతికి కారణమవుతున్నట్లు చెప్పారు. డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
కళాశాల చైర్మన్ కెటి మహి మాట్లాడుతూ విద్యార్థులకు అత్యున్నత విద్యా ప్రమాణాలను కల్పించేందుకు కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యనభ్యసించి అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డిసిపి రాంచంద్రారెడ్డి, ఏసిపి రవిచందన్‌రెడ్డి, షీ టీమ్స్ ఏసిపి స్నేహిత, కళాశాల డైరక్టర్ పి నర్సింహారెడ్డి, డీన్ పి వెంకట్‌రెడ్డి, ఘట్‌కేసర్ సిఐ బి.ప్రకాష్, నాలుగు వేలకు పైగా విద్యార్ధిని, విద్యార్ధులు పాల్గొన్నారు.