రంగారెడ్డి

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన డిసిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, ఆగస్టు 4: ఆగి ఉన్న లారీని డిసిఎం ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి తీవ్రగాయాలైన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కధనం ప్రకారం తూంకుంట శివారు దొంగల మైసమ్మ దగ్గరలోని డోమూస్ చౌరస్తా వద్ద పిబి 12 క్యూ 0935 నెంబర్ గల లారీ ఆగి ఉంది. మార్బుల్ లోడ్‌ను నింపుకొని కొంత మంది లేబర్లతో ఎల్‌బినగర్ నుండి సిరిసిల్లాకు వెళ్లుతున్న ఎపి 24 టిఎ 2507 నెంబర్ గల డిసిఎం డోమూస్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న లారీని బుధవారం అర్థరాత్రి ఢీకొట్టింది. ప్రమాదంలో డిసిఎంలో ప్రయాణిస్తున్న లేబర్లు యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి చెందిన కుమార్ (35), అచ్చంపేటకు చెందిన తిరుపతయ్య (40) అక్కడిక్కడే మృతిచెందగా డిసిఎం డ్రైవర్ బిక్షపతితో పాటు రాజు, మల్లేష్, చంద్రయ్య, ఎల్లయ్య, కృష్ణంరాజుకు తీవ్ర గాయాలు అవడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదాలకు నిలయం దొంగల మైసమ్మ చౌరస్తా
అనేక రోడ్డు ప్రమాదాలకు నిలయంగా దొంగల మైసమ్మ చౌరస్తాగా నిలిచిపోతుంది. ఈ చౌరస్తా నుంచి ఘట్‌కేసర్, కీసర మీదుగా వరంగల్ హైవేకు వెళ్లడం, వరంగల్ హైవే నుంచి రాజీవ్హ్రదారి మీదుగా సిద్దిపేటకు వెళ్లేందుకు లారీలు, డిసిఎంలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. చౌరస్తాలో రోడ్డు ప్రాంతం కొంత మేరకు గుంతలమయంగా ఉండటం రాత్రివేళల్లో రాకపోకలు కొనసాగిస్తున్న డ్రైవర్లకు కనిపించకపోవడంతో అనేక మార్లు ఇక్కడే ప్రమాదాలు జరుగుతున్నాయి. రాజీవ్హ్రదారి మీదుగా వచ్చే భారీ వాహనాల డ్రైవర్లు, పంజాబీ లారీ డ్రైవర్లు సేద తీరేందుకు తమ వాహనాలను ఆపి స్థానిక దాబాల్లో భోజనాలు చేస్తుంటారు. ఆగి ఉన్న లారీలను ఢీకొటి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి.
పోలీసుల ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా దాబాల్లో రాత్రి సమయాల్లో డ్రైవర్లకు మద్యం అందించడం, భోజనాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను సమకూర్చుతున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతాల్లో దాబాలను తొలగించి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.