రంగారెడ్డి

దేవాలయాలు సమాజాన్ని తీర్చిదిద్దే కర్మాగారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులకచర్ల, ఆగస్టు 5: దేవాలయాలు సమాజాన్ని తీర్చిదిద్దే కర్మాగారాలని, వాటి పట్ల నిష్ఠ నియమాలు కలిగి ఉంటే సమాజం కచ్చితంగా బాగుపడుతుందని హిందూ ధర్మ ప్రచార పరిషత్ పరివ్రాజకులు శీధరాచార్యులు ఉద్బోధించారు. కులకచర్ల మండల కేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పోశమ్మ అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం సంధర్బంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు శుక్రవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనతో ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. గత మూడు రోజుల నుంచి గ్రామంలో పండగ వాతావరణాన్ని తలపించింది. అంకురార్పణతో మొదలైన కార్యక్రమాల్లో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో శీధరాచార్యులు ముఖ్యఅతిథిగా విచ్చేసి అనుగ్రహ బాషణ గావించారు. ఆలయాల విశిష్టత, వివరిస్తూ మన పిల్లలకు మన పురాణాలు, ఇతిహాసాల గురించి కాకుండా విదేశీ వ్యామోహాన్ని నేర్పిస్తున్నామని దీంతో దేశంలో ఆశాంతి పెరిగిపోతున్నదని చెప్పారు. మన విద్యా విధానంలోని మార్పులే కారణమని ఉదాహరణలతో వివరించారు. మాజీ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ స్వామీజీ చెప్పిన విషయాలను మనం ఆచరిస్తే సమాజంలో అశాంతి ఉండదని అన్నారు. పరిగి శాసనసభ్యుడు టి.రామ్మోహనరెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనాక అనేక ధార్మిక కార్యక్రమాలు జరగడం తనకెంతో సంతోషాన్నిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ధర్మజాగరణ సమితి ప్రాంత ప్రముఖ్ ఉమాశంకర్ సిద్వాంతి, శాసనసభ మాజీ ఉప సభాపతి కొప్పుల హరీశ్వరరెడ్డి, బిజెపి నాయకుడు కరణం ప్రహ్లదరావు, డిసిఎంఎస్ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, శేరి రామిరెడ్డి, ఆలయ కమిటీ నిర్వాహకులు కర్రె భరత్‌కుమార్, తుప్పలి అశోక్ పాల్గొన్నారు.
బోనాల నిర్వహణ
అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా ఆషాఢంలో నిర్వహించే ఈ బోనాలు నూతన ఆలయ నిర్మాణం కారణంగా శ్రావణ మాసంలో చేసారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా కులకచర్లకు చెందిన ఉపాధ్యాయుడు జి. బుచ్చిలింగం అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక అంశాలతో కూడిన పుస్తకాలను అమ్మవారి పుస్తక ప్రసాదంగా వితరణ చేశారు.