రంగారెడ్డి

పంచాయతీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఆగష్టు 28: పంచాయతీ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తూ కనీస వేతనం అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.రవిచంద్రన్, కల్లూరి జయచంద్ర డిమాండ్ చేశారు. ఘట్‌కేసర్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్రన్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తు గత సంవత్సరం రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెకు దిగగా రాష్ట్ర మంత్రి కేటిఆర్ 60 రోజులలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి సంవత్సరం తర్వాత పంచాయతీ కార్మికులకు శుభవార్త అంటూ ఉన్న వేతనాల కంటే తక్కువ ప్రకటించారని అన్నారు. పంచాయతీ కార్మికులుగా పార్టు టైం పని చేస్తున్న కార్మికులకు రూ.1623 నుంచి రూ. 4000 వేలకు పెంచుతున్నట్లు చెప్పారని విమర్శించారు. రోజుకు 12 గంటలు పని చేస్తున్న కార్మికులను పార్ట్ టైం, పూల్ టైం అంటూ ప్రకటించటం సిగ్గు చేటని విమర్శించారు. పంచాయతీ కార్మికులుగా పని చేస్తున్న వారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు వెట్టి చాకిరి ఎలా చేస్తున్నారని, వారి శ్రమను గుర్తించకుండా పార్ట్ టైం కార్మికులుగా పేర్కొనటం సిగ్గు చేటన్నారు. గ్రామ పంచాయతీ ఆదాయంలో 30 శాతం మాత్రమే కార్మికుల వేతనాలు ఇవ్వాలనే నిబంధనను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికునికి కనీస వేతనం రూ.14 వేలుగా నిర్ణయించి రెగ్యులరైజ్ చేస్తు ఇఎస్‌ఐ, పిఎఫ్, బోనస్, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రోజుకు పది నుంచి 12 గంటలు పని చేస్తున్న కార్మికులను పుల్ టైం, పార్ట్ టైం కార్మికులు అంటూ కార్మికుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యహరిస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.