రంగారెడ్డి

తాండూరులో భయంకరం.. వాయు కాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఆగస్టు 28: వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో దినదినాభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తాండూరు పట్టణ, పరిసర ప్రాంతాలలో వాయు కాలుష్యం అంతే స్థాయిలో ఉద్ధృతమవుతూ భయంకర ముప్పుగా మారింది. ఆదివారం విలేఖరుల సమావేశంలో తాండూరు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి, పర్యవరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త రాజ్‌గోపాల్ పార్డా మాట్లాడుతూ వాతావరణంలో సమతుల్యత దెబ్బతినటంతో తాండూరులో వాయు కాలుష్యం తీవ్రతరంగా మారుతుందని అన్నారు. విపరీతమైన వాహనాల రద్దీకి తోడు స్థానిక సంబంధిత అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం వాయు కాలుష్య నియంత్రణలో కనీస చర్యలు చేపట్టక పోవడం వంటి అవగాహాన రాహిత్య విధానాలతో నేడు తాండూరు ప్రాంతంలో, వాయు కాలుష్యం ప్రాణాపాయ భరితంగా మారిందని వివరించారు. తాండూరు పట్టణ, పరిసర ప్రాంతంలో వాయు కాలుష్యం తీవ్రత ఒక్క ఘణపుటడుగుకు 100 మిల్లీ గ్రాముల పరిమాణంలో ఉండాల్సిన స్థాయిలో, ఊహకు అందని రీతిలో ప్రతి ఒక్క ఘనపుటడుగుకు 622 మిల్లీ గ్రాముల భయంకర స్థాయిలో ఉందని చెప్పారు. ఐదారేళ్లుగా తాను పోరాటం చేస్తూ, సంబంధిత అధికారులందరికి వాయు కాలుష్యం తీవ్రత గురించి విజ్ఞాపనలు చేసి అలసిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా జాతీయ హారిత ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించి ఎట్టకేలకు వాయు కాలుష్యం నియంత్రణలో విఫలం చెందిన తాండూరు ప్రాంతం అధికారులతోపాటు, సంబంధిత కాలుష్య నియంత్రణ బోర్డు అధికార యంత్రాంగాన్ని, తాండూరు రెవెన్యూ తహశీల్దార్, ఆర్డీఓ, సబ్-కలెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, కేంద్ర, రాష్ట్ర అధికారులు, తాండూరు మున్సిపల్ కమిషనర్ వంటి క్రింది స్థాయి అధికారులందరినీ బాధ్యులుగా పేర్కొంటూ మొత్తం ఎనిమిది అధికారులపై నేషనల్ గ్రీనరీ ట్రిబ్యూనల్, చెన్నైలో ట్రిబ్యూనల్, డా.జ్యోతిమణి న్యాయస్థానంలో కేసును నమోదు చేసిందని వివరించారు. కాగా ఎన్‌జిటి న్యాయస్థానం బాధ్యులైన అధికారులందరికీ సెప్టెంబర్ 19న తగిన వివరణలు కోరుతూ ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. ఎన్‌జిటిలో తమ కేసు ఈనెల 26న అడ్మిట్ అయిందని వివరించారు.