రంగారెడ్డి

ప్రజల ఆహ్లాదం కోసమే మినీట్యాంక్ బండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఆగస్టు 28: ప్రజల ఆహ్లాదం కోసమే చెరువులను సుందరీకరణ చేసి మినీ ట్యాంక్‌బండ్‌లా తీర్చిదిద్దడం జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. ఆదివారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పల్లెచెరువులో పేరుకుపోయిన గుఱ్రపుడెక్కను తొలగించడానికి పనులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల సుందరీకరణ చేస్తూ ప్రజల ఆహ్లాదానికి తోడ్పాటయ్యేలా కృషి చేస్తుందని వెల్లడించారు. పల్లె చెరువును సుందరీకరణ చేసి మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతామని, పార్కు, వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలకు సేద తీర్చుకోవడానికి మినీ ట్యాంక్‌బండ్‌లు ఎంతో దోహదపడుతాయని పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనం కోసం చెరువులో పేరుకుపోయిన గుఱ్రపుడెక్కను తొలగించి సుందరీకరణ చేస్తున్నామని చెప్పారు. చెరువు స్థలాలను ఎవరైనా కబ్జా చేస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, ప్రభుత్వం ఈ విషయంపై ఆగ్రహంగా ఉందన్నారు. వెంటనే చెరువులను సర్వే చేయించి చెరువు స్థలాలను ఆధీనంలోకి తీసుకొని ఫెన్సింగ్ వేస్తుందని తెలిపారు. చెరువుల పూడికతీత పనులను మొదటి, రెండు విడుతలుగా పూర్తయ్యాయని, మరికొన్ని చెరువులను పూడికతీతకు ఎంపిక చేశారని వివరించారు. కార్యక్రమంలో సరికొండ వెంకటేష్, సంతూగౌడ్, ఎన్ను శ్రీనివాస్‌రెడ్డి, రాజు ముదిరాజ్, పోచయ్య పాల్గొన్నారు.