రంగారెడ్డి

పండుగలను సామరస్యంగా జరుపుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, ఆగస్టు 28: వినాయక నవరాత్రి ఉత్సవాలను, బక్రీద్ పండుగలను సామరస్యంగా జరుకోవాలని చేవెళ్ల డిఎస్పీ శృతకీర్తి అన్నారు. చేవెళ్ల పోలీసు స్టేషన్‌లో ఆదివారం చేవెళ్ల మండలంలోని అన్ని గ్రామాల వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో, ముస్లింలతో శాంతి సమావేశాన్ని నిర్వహించారు. పండుగలను కలిసి మెలిసి ప్రశాంతంగా జర్పుకోవాలని తెలిపారు. వినాయక మండపాలకు, నిమజ్జనానికి ముందుగానే పోలీసు స్టేషన్‌లో అనుమతి తీసుకోవాలని సూచించారు. నిమజ్జనానికి సంబంధించి రూట్ మ్యాప్‌ను ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు ఇవ్వాలని తెలిపారు.
వివాదస్పద స్థలాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయద్దన్నారు. రోడ్డు మధ్యలో విగ్రహాన్ని ప్రతిష్ఠించిచి వాహనదారులకు ఇబ్బందులు కలింగిచ వద్దన్నారు. బలవంతంగా చందాలు వసులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వినాయక మండపాలకు విద్యుత్ వినియోగానికి అనుమతి తీసుకోవాలని చెప్పారు. డిజె సౌండ్‌కు అనుమతులు లేవని స్పష్టం చేశారు. చేవెళ్ల ఎస్సై బి.్భముకుమార్, ఎంపిపి బాల్‌రాజ్ పాల్గొన్నారు.