రంగారెడ్డి

నిలిచిపోయిన బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బాండ్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఆగస్టు 28: మేడ్చల్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బాండ్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా సేవలు నిలిచిపోయిన సంబంధిత అధికారులు నీమ్మకు నిరేత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపించారు. పట్టణంలోని గోదావరి జలాల సరఫరా నిమిత్తం పైపులైన్ ఏర్పాటు కోసం తవ్వకాలు చేపడుతుండటంతో తరచూ కేబుల్ తెగిపోయి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం పరిపాటిగా మారిందని ఇది సంబంధిత అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. ప్రభుత్వం అందించే అన్‌లైన్ సేవలన్నీ బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్‌తోనే అందింస్తుడటంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు విచ్చేసే ప్రజలు తీరా సేవలకు విఘాతం ఏర్పడటంతో చేసేదిలేక నిరాశగా వెనుదిరుగుతున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో వివిధ పనుల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే క్రయ విక్రయదారులు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల కోసం, ఎటిఓలో లావాలదేవీలు, బ్యాంక్‌లో సేవలు నిలిచిపోతున్నాయి. దీంతో ప్రజా ప్రయోజనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మిషన్ భగరీథ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న పైపులైన్‌ల మూలంగా రెండు మూడు నెలలుగా ఇంటర్నెట్ సేవలకు తరచూ విఘాతం కలుగుతుందని పలువురు తెలిపారు. అధికారుల మధ్య కొరవడిన సమన్వయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. పైపులైన్ పనులు చేసే సమయంలో బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు కలిసి పని చేస్తే ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలుగకుండా ఉంటుందని ప్రజలు వివరించారు. ఒకవేళ కేబుల్ తెగిపోయిన అప్పటికప్పుడే మరమ్మతులు చేయడానికి వీలు కలుగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రతి అంశం ఆన్‌లైన్‌తో మూడిపడి ఉండటంతో అధికారులు ఆ దిశగా ఆలోచించి వెంటనే రంగంలోకి దిగి తగు చర్యలు తీసుకుంటే మంచిదని పేర్కొంటున్నారు.