రంగారెడ్డి

సైనికులపై ఉగ్రవాదుల దాడి అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, సెప్టెంబర్ 19: ఉగ్రవాదుల చర్యలకు నిరసనగా బిజెవైఎం జిల్లా కార్యదర్శి రేవెల్లి రాజు ఆధ్వర్యంలో ఉప్పల్ కమాన్ వద్ద సోమవారం పాకిస్తాన్ జెండాను దగ్ధం చేశారు. కవ్వింపు చర్యలను పాకిస్తాన్ మానుకోకపోతే భారతదేశ సైన్యం గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉందని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని యావత్ భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాశ్మీర్ యురీలో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన వీర జవాన్లకు జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబాలకు భారతదేశ ప్రజలు అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు మహంకాళీ లక్ష్మణ్, బొంగు రమేశ్ గౌడ్, నాని, నాగరాజు, శ్రవణ్, శ్రీనివాస్, ఈగ లక్ష్మణ్, వంశీ, రమేశ్, దినేష్, భరత్, నర్సింహ, రాయల్ బాబు, శివ, బాలకృష్ణ పాల్గొన్నారు.
కశ్మీర్ ఉగ్రదాడిపై నిరసనలు
కులకచర్ల: కశ్మీర్‌లో భారత జవానులపై అమానుషంగా దాడి చేసిన ఘటనపై కులకచర్లలో తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. పార్టీలకతీతంగా వివిధ విద్యాలయాలకు చెందిన విద్యార్థులచే రోడ్డుపై సోమవారం బైఠాయించి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా, తెరాస నేతలు మాట్లాడుతూ పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. ఉదయం నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీగా ప్రధాన చౌరస్తాకు చేరుకున్నారు. దేశం కోసం ప్రాణాలను బలిదానంగా ఇచ్చిన సైనికుల ఆత్మశాంతి చేకూరాలని కోరుకున్నారు. కార్యక్రమంలో భాజపా నాయకుడు అంజిలప్ప, తెరాస మండల శాఖ అధ్యక్షుడు హరికృష్ణ, ఎంపిటిసి మాలె కృష్ణయ్య పాల్గొన్నారు.
ఎల్‌బినగర్‌లో...
ఎల్‌బినగర్: కాశ్మీర్‌లోని భారత సైనికులపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మహుతి దాడి అమానుషమని ఎల్‌బినగర్ బిజేవై ఎం కన్వీనర్ గన్‌గమ్ నవీన్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం గన్‌గమ్ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో భారత సైనికులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులను నిరసిస్తూ దిల్‌సుఖ్‌నగర్ రాజీవ్ చౌక్ వద్ద పాకిస్తాన్ జెండాను దహనం చేశారు. నవీన్‌కుమార్ మాట్లాడుతూ భారత సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం బాధకరమని, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో బిజేవై ఎం నాయకులు రాజారెడ్డి, అనంతచారి, కిరన్, సంతోష్, రాజు, వెంకట్, విక్రమ్, కృష్ణ ఉన్నారు.
పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి
వికారాబాద్: ఆరు దశాబ్దాలుగా మనదేశంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ దాడులు చేస్తున్న పాకిస్తాన్‌ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద దేశంగా ప్రకటంచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్), ఎబివిపి, బిజెపి డిమాండ్ చేసింది. యూరి సైనిక స్థావరంపై జరిగిన దాడికి నిరసనగా తెలంగాణ కూడలిలో సోమవారం పాకిస్తాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే పాకిస్తాన్‌పై యుద్దం అపకటించి బుద్ది చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశ సరిహద్దులో రక్షణలో ఉన్న సైనికులను నిద్రిస్తున్న సమయంలో దాడి చేయడం పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణ త్యాగం చేసిన అమర జవానుల ఆత్మశాంతికోసం వౌనం పాటించి, వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో తపస్ నాయకులు ప్యాట మల్లేశం, కమాల్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్, అంజిరెడ్డి, ఎబివిపి నాయకులు మణికంఠ, శ్రీకాంత్‌రెడ్డి, మనోజ్, రాఘవేందర్, నరేందర్, బిజెపి నాయకులు శివరాజ్, మాధవరెడ్డి, సతీష్, పాండుగౌడ్, వివేకానందరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గిరీష్‌కొఠారి, కెపి రాజు పాల్గొన్నారు.
సైనికులను కాల్చి చంపడం పిరికిపంద చర్య
శేరిలింగంపల్లి: సైనిక స్థావరంపై దొంగచాటుగా కాల్పులు జరపడం పిరికిపంద చర్య అని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి అన్నారు. సోమవారం చందానగర్ డివిజన్ పరిధిలోని విద్యానగర్ కాలనీలో వీరమరణం పొందిన 17మంది భారత జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న సైనికులను దొంగచాటుగా కాల్చి చంపడం హేయమైన చర్య అని, ఈ ఘాతుకానికి పాల్పడిన ముష్కరులకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. వీర జవాన్లకు నివాళులు అర్పిస్తు అమర జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కె.సునీతరెడ్డి, పారునంది శ్రీకాంత్, ఏనుగు వెంకటరెడ్డి, పంతులు, కృష్ణారెడ్డి, పోచయ్య, చందర్‌రావు, లక్ష్మణ్, సలీం పాల్గొన్నారు.

ఆంధ్రభూమి బ్యూరో