రంగారెడ్డి

ప్రాణాలు పోయేవరకు చేవెళ్ల జిల్లా కోసం పోరాడుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, సెప్టెంబర్ 22 : చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలను కలుపుకుని చేవెళ్ల జిల్లా కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసేందుకు తన ప్రాణాలనైనా అర్పిస్తానని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం అన్నారు. గత మూడు రోజుల నుండి చేవెళ్ల జిల్లాకోసం కొనసాగుతున్న పోరుకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ కేంద్రం జిల్లా కేంద్రంగా కావడానికి అవకాశం ఉందన్నారు. వికారాబాద్, తాండూర్, పరిగి అభివృద్ధి చెందింది, కాని చేవెళ్ల ఇప్పుడిప్పుడే అబివృద్ధి చెందుతోందన్నారు. దీంతో మళ్లీ చేవెళ్ల వెనుకబడి పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలు ఏర్పాటు తర్వాత చేవెళ్లలో ఏ ఒక్క డివిజన్ కార్యాలయం ఉండదని అన్నారు. సిఎం ప్రజల అభిప్రాయాల మేరకే జిల్లా చేస్తానన్నారు అయితే చేవెళ్లను విస్మరించినందున మనం చేసే ఆందోళనల ద్వారా ప్రభుత్వంపై వత్తిడి తేవాలన్నారు. చేవెళ్ల జిల్లా కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేసి సాధించుకుందామని సూచించారు. చేవెళ్ల జిల్లాకోసం మొయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి మండల ప్రజలు కూడా కదలికావాలని ఆయన కోరారు.
చేవెళ్ల ఎంపిపి బాల్‌రాజ్ మాట్లాడుతూ తాను చేవెళ్ల జిల్లాకు వ్యతిరేకం కాదని, ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించానని అన్నారు. ఏదోచిన్న మనస్పర్ధల వల్ల దూరంగా ఉన్నానని వివరించారు. చేవెళ్ల జిల్లా కేంద్రమైతే చేవెళ్లలో ప్రభుత్వ కార్యాలయాలకు తన సొంత భూమి నాలుగు ఎకరాలు ఇస్తానాని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గత 16 రోజుల నుండి చేవెళ్లలో ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం ఏమిటన్నారు. చేవెళ్ల జిల్లా కేంద్రంగా ఏర్పాటు అయ్యే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఏడోరోజుకు చేరిన ఆందోళన
చేవెళ్ల జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు గురువారం ఏడో రోజుకు చేరాయి. చేవెళ్ల పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. దీనిలో భాగంగానే ఆయాగ్రామాల ప్రజలు జై చేవెళ్ల, జై జై చేవెళ్ల అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శనగా చేవెళ్లకు చేరుకుని దీక్షకు మద్దతు తెలిపారు. మండల కేంద్రంలో దుకాణాలు మూసి ఉన్నాయి. హైదారాబాద్ బీజాపూర్- జాతీయ రహదారిపై రాకపోకలను అడ్డుకున్నారు. ఉదయం నుండి సాయత్రం వరకు రాస్తారోకో చేయడంతో పాటు రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోరాట సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, డిసిసి మాజీ అధ్యక్షుడు వెంకట్‌స్వామి, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మధుగుప్తా, మాణిక్యం, సిపిఐ చేవెళ్ల నియోజకవర్గం కార్యదర్శి రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభులింగం, చేవెళ్ల పిఎసిఎస్ మాజీ చైర్మన్ శ్రీ్ధర్‌రెడ్డి, నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, రమేష్‌గౌడ్, మల్లేష్, సునీల్, వెంకటేష్, యాదయ్య, శ్రీనివాస్, సత్తయ్య, పాండుయాదవ్, విఠల్‌రెడ్డి, శ్రీనివాస్, ఆంజనేయులు, దామోదర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రవికాంత్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, మున్నూరు నర్సింలు, రవీందర్‌రెడ్డి, శంకర్, బురాన్ రాములు, శ్రీ్ధర్‌రెడ్డి, శ్రీనివాస్, రాములు, పాండ్‌రంగారెడ్డి, విఠలయ్య, వెంకట్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, సంజీవ, కళాకారుల బృందం పాల్గొన్నారు.