రంగారెడ్డి

‘వికారాబాద్ జిల్లా ఇస్తామన్నా ఉనికి కోసమే ప్రతిపక్షాల లొల్లి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, సెప్టెంబర్ 26: వికారాబాద్ జిల్లా కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఉనికి కోసమే కాంగ్రెస్, టిడిపి, బిజెపి.. అఖిలపక్షం పేరిట ఆందోళన, ఉద్యమాలు చేస్తున్నాయని టిఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక నర్సింగ్ గౌలికర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యకర్తలుంటేనే పార్టీ ఉంటుందని, పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులున్నా ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు జిల్లా విషయంలో ఆందోళన చేస్తే అభాసుపాలవుతారని, వేరే మార్గం చూసుకోవాలని, కొన్ని పార్టీలకు సారధులే లేకుండా పోయారని చురకలు వేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు తామే ఎక్కువ పోరాటం చేశామని చెప్పారు. ఎల్‌బినగర్‌లో ఉన్న జిల్లా కోర్టుకు వెళ్లాలంటే ప్రజలు ఇక్కట్లపాలవుతున్నారని, కేంద్ర బిందువుగా వికారాబాద్ ఉందని పరిగిలో కాకుండా జిల్లా కోర్టును వికారాబాద్‌లో ఏర్పాటు చేయించామని తెలిపారు. ఎప్పటికైనా వికారాబాద్ జిల్లా కేంద్రమవుతుందని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని నాలుగు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. జిల్లాకు జెసిలను కేటాయించి, ఇక్కడ సబ్‌కలెక్టర్‌ను నియమించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాలను ఏర్పాటు చేస్తోందని, మెనిఫెస్టోలో పొందుపర్చిన ప్రకారం జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ నాయకులకు ఏమీ దొరకకనే రాష్ట్రంలో ప్రాజెక్టులపై, ఇక్కడ వికారాబాద్ జిల్లా విషయంలో దీక్షల పేర సమయాన్ని గడుపుతున్నారని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ళుగా టిఆర్‌ఎస్ కార్యకర్తలు నిలకడగా ఉన్నారని, మనోధైర్యాన్నిచ్చి పనులు కల్పించాలని సూచించారు. వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. సమయం వచ్చినపుడు ఎవరు ఏమి చేస్తున్నారో బయటకు తెస్తామని చెప్పారు. సమావేశానికి టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.శుభప్రద్ పటేల్ అధ్యక్షత వహించగా, వికారాబాద్, ధారూర్ మార్కెట్ కమిటి చైర్మన్‌లు ఎస్.రాంచంద్రారెడ్డి, రాజునాయక్, ధారూర్ పిఎసిఎస్ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ హెచ్.సురేష్, జడ్పీటిసి ముత్తార్‌షరీఫ్, పట్టణ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు జి.విజయేందర్‌గౌడ్, ధారూర్ మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణయ్య, జిల్లా వాల్టా సభ్యుడు ఎం.సురేష్, పట్టణ టిఆర్‌ఎస్ నాయకుడు టి.శంకర్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య, కౌన్సిలర్లు సంగీత, అనసూయ, రాజమల్లు, సర్పంచుల సంఘం మండల మాజీ అధ్యక్షుడు ఎస్.ఎల్లారెడ్డి, నాయకుడు నరోత్తంరెడ్డి, మార్కెట్ కమిటి వైస్‌చైర్మన్ విజయ్, మాజీ ఎంపిపి నర్సింహరెడ్డి పాల్గొన్నారు.