రంగారెడ్డి

వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, సెప్టెంబర్ 26: మేడ్చల్ - కిష్ఠాపూర్ మధ్య ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో సోమవారం ఉదయం ఓ వ్యక్తి బైక్‌తో సహ కొట్టుకుపోతుండగా గమనించిన స్థానికులు వ్యక్తిని కాపాడగా బైక్ మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. బాధితుడి కథనం ప్రకారం వారం రోజులుగా కుండపోతగా కురిసిన వర్షాలకు మేడ్చల్ పెద్ద చెరువు అలుగు ఉద్ధృతంగా పారుతున్న విషయం తెలిసిందే. మేడ్చల్ పెద్ద చెరువు నీరు అలుగు పారి కిష్ఠాపూర్ వాగు గుండా శామీర్‌పేట్ పెద్ద చెరువులోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో వాగు పలు ప్రాంతాల గుండా చాలా ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. మేడ్చల్ నుండి కిష్ఠాపూర్‌కు వెళ్లే మార్గమధ్యలో రోడ్డుపై నుండి కూడా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది.
మేడ్చల్‌కు చెందిన వేణు(35) అనే ఏల్లంపేట్ గ్రామ పరిధిలోని శ్రీరామ స్పిన్నింగ్ మిల్‌లో పని చేస్తున్నాడు. కాగా వేణు తన హీరోహోండా స్పెలెండర్ బైక్‌పై నీటిడబ్బా (వాటర్‌క్యాన్)ను పెట్టుకోని మేడ్చల్ నుండి కిష్ఠాపూర్ వెళుతూ మార్గమధ్యలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు యత్నించాడు. అప్పటికే వాగు చాలా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో వేణు తన ముందు రెండు బైక్‌లు వెళ్లడం గమనించి తాను కూడా వెళ్లవచ్చనే ధీమాతో వాగులో నుండి వెళ్లేందుకు యత్నించాడు. ఈ క్రమంలో వాగు మధ్యలోకి వెళ్లగానే వేణు బైక్ ఆగిపోయింది. దీంతో వేణు ప్రవహిస్తున్న నీటిలో కొద్ది సేపు ఉన్న తర్వాత బైక్‌పై ఉన్న వాటర్‌క్యాన్ అదుపు తప్పి కిందపడే క్రమంలో బైక్‌తో పాటు వేణు కూడా నీటిలో పడిపోయారు. వాగు నీరు ఉద్ధృతంగా వస్తుండటంతో బైక్‌తో పాటు వేణు నీటిలో కొట్టుకుపోయి కల్వర్టు దాటి వాగులో పడిపోయాడు. వెంటనే వేణు వాగులో ఓ చెట్టును పట్టుకోగా గమనించిన స్థానికులు వెంటనే తాళ్ల సహయంతో వేణును కాపాడారు. బైక్ మాత్రం వాగులో కొట్టుకుపోయింది. వేణు బ్రతుకు జీవుడా అంటూ నీటిలో నుండి బయటకు వచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పలువురు వేణు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు నీటి గుండా వెళ్లేందుకు ఎందుకు సాహసం చేశావంటూ గరమయ్యారు. వాగులో కొట్టుకుపోయిన బైక్ జాడ మాత్రం కానరాలేదు. నీటి ప్రవహం తగ్గిన తర్వాతే బైక్ జాడ తెలుస్తుందేమో చూడాలి.