రంగారెడ్డి

వికారాబాద్‌లో శంకర్‌పల్లి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్‌పల్లి, సెప్టెంబర్ 26: శంకర్‌పల్లి మండలాన్ని వికారాబాద్‌లో కలపాలనే కుట్రలను ఆ ప్రాంత నాయకులు సహృదయంతో మానుకోవాలని లేకుంటే ఊరుకోమని శంకర్‌పల్లి మండల అఖిలపక్షం నాయకులు హెచ్చరించారు. సోమవారం స్థానిక అతిథి గృహంలో అఖిలపక్షం నాయకులు విలేఖరుల సమావేశంలో వికారాబాద్ నాయకుల ఆలోచనలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎంపిపి ఎం.నర్సింలు, వైస్ ఎంపిపి శశిధర్‌రెడ్డి, జడ్‌పిటిసి కళావతి విఠల్, గోవర్దన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ శంషాబాద్ జిల్లాలో శంకర్‌పల్లిని కలాపాలని తాము ఇరవై రోజులు రాస్తారోకోలు, ధర్నాలు, బంద్‌లు, రిలే నిరాహార దీక్షలు చేసినందుకు సిఎంతో మంతి మాట్లాడి ఒప్పించిన సంగతిని గుర్తుచేసారు. కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ, నర్సింహారెడ్డి, జైరాంరెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.