రంగారెడ్డి

రికార్డుల్లో ఫోర్జరీ..తహశీల్దార్ కు జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, సెప్టెంబరు 26: రెవెన్యూ రికార్డుల్లో ఫోర్జరీ చేసిన నేరం కింద తహశీల్దార్‌తో సహా మరో ఆరుగురు నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. తహశిల్దార్‌కు 30వేల జరిమానా, మిగతా నిందితులకు 25వేలు జరిమానా విధిస్తూ 19వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సోమవారం తీర్పు వెల్లడించారు. చందానగర్ ఇన్‌స్పెక్టర్ ఎన్.తిరుపతిరావు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని గండీడ్ తహశీల్దార్‌గా పనిచేస్తున్న ఎం.శ్రీనివాసరావు 2006 సంవత్సరంలో శేరిలింగంపల్లి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. కాగా గచ్చిబౌలి సర్వే నెంబర్లు 109, 111లో ఉన్న ఒక ఎకరం పైచిలుకు భూమికి సంబంధించి పహాణీల్లో గల కబ్జా కాలంలో అప్పటి ఆర్‌ఐ ఎం.శ్రీనివాసరావు అదనంగా అనర్హుల పేర్లు చేర్చుతూ 2006 సంవత్సరంలో ఫోర్జరీకి పాల్పడ్డారు. సదరు భూమికి సంబంధించిన ఎన్‌ఆర్‌ఐ అయిన మెహదీపట్నంకు చెందిన రాంబాబు 2007లో చందానగర్ పోలీసులను ఆశ్రయించగా క్రైం నెంబర్ 340/2007 ద్వారా ఐపిసి 420,423,425,468,471,120బి సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన జి.శంకర్, జి.అశోక్ కుమార్, జి.రత్నయ్య, ఎం.పద్మ, ఎల్.నందుసింగ్, కె.సుల్తాన్ సాగర్‌ల పేర్లను వరుసగా నిందితులు ఎ1 నుంచి ఎ6గా, అప్పటి ఆర్‌ఐ ఎం.శ్రీనివాసరావును ఎ7 నిందితుడుగా పోలీసులు కేసులో చేర్చారు. 1954/2014 నెంబరు ద్వారా చందానగర్ పోలీసులు 2014 సంవత్సరంలో ఛార్జిషీట్ వేసి కోర్టుకు దాఖలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వం తరపున ఎపిపి టి.రాజేశ్వర్ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి ప్రస్తుత గండీడ్ తహశిల్దార్ ఎం.శ్రీనివాసరావుకు మూడేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు 30వేల జరిమానా, మిగతా ఆరుగురు నిందితులకు మూడేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు 25వేల జరిమానా విధిస్తూ మియాపూర్‌లోని 19వ ఎంఎం కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది.