రంగారెడ్డి

ఫ్యాక్స్‌సాగర్‌కు వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, సెప్టెంబర్ 26: జీడిమెట్ల ఫ్యాక్స్‌సాగర్ చెరువు డేంజర్ స్థాయికి చేరింది. గత 25 ఏళ్ల తరువాత ఫ్యాక్స్‌సాగర్ చెరువు మళ్లీ నిండుకుండలా మారింది. సుమారు 2000 సంవత్సరంలో ఫాక్స్ సాగర్ చెరువు నిండి కట్ట తెగిపోవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మళ్లీ దాదాపు పదిహేను ఏళ్ల తరువాత ఫ్యాక్స్‌సాగర్ చెరువు డేంజర్ స్థాయికి చేరింది.
చెరువు 34 అడుగుల నీటి మట్టం ఉండగా అందులో 22 అడుగుల వరకు నీరు చేరింది. ఇప్పటికే చెరువు కట్టకు గండి పడే విధంగా కట్ట నుండి నీరు బయటికి వచ్చింది. స్థానికులు గమనించి కట్ట ప్రమాదానికి గురి కాకుండా చర్యలు తీసుకున్నారు. జీడిమెట్ల ఫ్యాక్స్ సాగర్ చెరువు కింద ఉన్న ఉమామహేశ్వర కాలనీ నీట మునిగింది. కాలనీలో సుమారు 640 ఇళ్లు ఉండగా అందులో దాదాపు 300 ఇళ్లలోకి వరద నీరు చేరిందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని ఇళ్లు, షెడ్‌లు, ప్రహారీలు పూర్తిగా నిండిపోయాయి. చుట్టు ప్రక్కల వేసుకున్న గుడిసెల్లోకి సైతం వరద నీరు చేరింది. నీట మునిగిన ఇళ్లల్లోని సామాగ్రి పూర్తిగా తడిసిముద్దాయ్యాయి.
సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం వరద బాదితులను కొంపల్లి గ్రామంలోని కమిటీ హాల్‌కు తరలించి బోజన సదుపాయాన్ని అధికార యంత్రాంగం చేపట్టారు. ఉమామహేశ్వర కాలనీకి ఉన్న దారులన్నీ నీట మునిగాయి. కాలనీకి వెళ్లాలంటే నడుం లోతు వరకు రోడ్డు పై వరద నీరు చేరింది. అయితే కాలనీకి వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టారు. జేసిబీల ద్వారా కాలనీకి వెళ్లేందుకు తాత్కాలిక రోడ్డు మరమ్మతులను ముమ్మరం చేశారు. ఇక చెరువు కట్ట కింద ఉన్న పలు పరిశ్రమలలోకి వరద నీరు చేరింది. ఇదేరకంగా మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షం కురిస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేదని స్థానికులు వాపోతున్నారు.
జీడిమెట్ల ఫ్యాక్స్ సాగర్ చెరువును సోమవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువు మ్యాప్‌ను పరిశీలించి అలుగులను, నాలాలను, విస్తీర్ణాన్ని తెలుసుకున్నారు. ఉమామహేశ్వర కాలనీ వరద బాదితులను పరామర్శించి సమస్యలను తెలుసుకున్నారు. వారికి అధికారుల నుండి సహాయక చర్యలు ఏవిధంగా అందుతున్నాయనే విషయాన్ని బాదితులను అడిగారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ వరద బాదితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలను చేపట్టాలని, చెరువుకు ఎలాంటి ముంపు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపిపి సన్న కవిత, సర్కిల్ ఉపకమిషనర్ మమత, బాలానగర్ ఎసిపి నర్సింహారెడ్డి, జీడిమెట్ల సిఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.