రంగారెడ్డి

ఆసరా పింఛన్ల అక్రమాలపై సిబిసిఐడి విచారణకు కౌన్సిల్ తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, సెప్టెంబర్ 26: తాండూరు మున్సిపల్ పరిధిలోని 31 వార్డులలో చోటు చేసుకున్నట్లు భావిస్తున్న ఆసరా పింఛన్ల అక్రమాల పట్ల సోమవారం చైర్‌పర్సన్ కొట్రిక విజయలక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సర్వ సభ్య సమావేశంలో సభ్యులు అన్ని పార్టీలకు చెందినవారు తీవ్రంగా స్పందించారు. పత్రికల్లో, ఆసరా ఫింఛన్ల పంపిణీ వ్యవహారంలో రెండు ఏళ్లుగా చోటు చేసుకున్న అక్రమాలలో కౌన్సిలర్ల పాత్ర అంటూ, కథనాలు వెలువడటం చాలా బాధాకరం అంటూ టిడిపి, ఫ్లోర్ లీడర్ ఎస్.సుమిత్‌గౌడ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. అజెండాలోని 15 అంశాలు, అభివృద్ధి పనులపై చర్చ తదితర అంశాలు తర్వాత ప్రస్తావించు కుందామని, ముందు ఇటీవలి వెలుగు చూసిన ఆసరా పింఛన్ల పంపిణీలో భారీ స్థాయిలో అక్రమాలు, అందులో కౌన్సిలర్లకు సైతం లక్షలాధి రూపాయలు దిగమింగినట్లు ఆరోపణలు మిన్నంటుతున్నాయని అన్నారు. అందుకు సంబంధించి మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మీ సిబిసిఐడిచే విచారణ జరిపిస్తామంటూ ప్రకటించారని సుమిత్‌గౌడ్ ప్రస్తావించారు. దాంతో స్పందించిన చైర్‌పర్సన్ విజయలక్ష్మీ.. ఇప్పటికీ తాను సిబిసిఐడిచే విచారణకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
మంత్రి మహేందర్‌రెడ్డి సైతం సిఐడి విచారణ చేయించమని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కాగా అప్పటికప్పుడే, చైర్‌పర్సన్ సమావేశంలో అధికారుల చేత సిబిసిఐడికి లేఖను రాయించి సభ ఆమోదం గురించి సమావేశం ముందుంచారు.
మున్సిపాలిటీ పరిధిలోని దాదాపు అన్ని వార్డులలో కౌన్సిలర్లు అప్పటి అధికారులు, మాజీ మున్సిపల్ కమిషనర్ వి.గోపయ్య, అకౌంటెంట్ సుధాతన్ బాబుతో కలిసి ఆసరా పింఛన్లలో భాగస్వాములై లక్ష రూపాయల్లో ప్రజాధనం దిగమింగినట్లు ఆరోపణలు వెలువడటం శోఛనీయమని 9వ వార్డు కౌన్సిలర్ నీరజా బాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆసరా అక్రమాలపై విచారణలకు తాను సిద్ధం అంటూ ప్రకటించారు. తన వార్డుకు సంబంధించి ఆసరా ఫింఛన్ల లబ్దిదారుల జాబితాలను మున్సిపల్ చైర్‌ఫర్సన్, అధికారులు, మీడియా ముందు నీరజా వెల్లడించారు. కాగా నీరజా బాటలో మిగతా కౌన్సిలర్లు పయనించి తమ నిజాయితీని నిరూపించుకుంటారా లేదంటే సిబిసిఐడి విచారణ ఎదుర్కొంటారా అనేది తెలాల్సి ఉంది.
జవాన్లకు నివాళి
ఇటీవలి కశ్మీర్‌లోని యూరి ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దొంగ దెబ్బ దాడిలో మరణించిన వీర జవాన్లకు సంతాప సూచికంగా తాండూరు మున్సిపల్ సమావేశంలో చైర్‌పర్సన్, కౌన్సిల్ సభ్యులు ఐదు నిముషాలు వౌనం పాటించారు.
గతనెల 8న మృతిచెందిన తాండూరు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.మాణిక్ రావుకు సంతాపం తెలిపారు.
కాగా ఆసరా పింఛన్ల అక్రమాలలో అధికారుల దుశ్చర్యలకు భయపడి ఆత్మహత్యకు పాల్పడిన మున్సిపల్ అవుట్ సోర్సింగ్ చిరుద్యోగి మహేష్‌కు కౌన్సిల్ సంతాపం ప్రకటించింది.