రంగారెడ్డి

ప్రతి పల్లెకు రవాణా సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30: రాష్ట్రంలోని ప్రతి పల్లెకు, గ్రామానికి, మారుమూల తండాలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తామని రాష్ట్ర రోడ్డ రవాణాశాఖ మంత్రి పట్నం మహేంధర్‌రెడ్డి పునరుద్ఘాటించారు. శనివారం స్థానిక బస్‌డిపోలో 5 రూట్లలో ఐదు బస్సులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి మహేంధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. రూ.40 కోట్లతో 150 కొత్త బస్సుల కొనుగోలు చేశామని చెప్పారు. రూ.32కోట్లతో రాష్ట్రంలోని 95 డిపోలు, బస్టాండ్‌లను ఆధునీకరిస్తామని వెల్లడించారు. బస్టాండ్‌లు, డిపోలలో సిసి రోడ్ల నిర్మాణం, మురుగుకాలువ వ్యవస్థ పునరుద్ధరణ వంటి చర్యలకు నిధులను వెచ్చిస్తామని తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆర్టీసి డిపో హైదరాబాద్-రంగారెడ్డి డివిజన్‌ల పరిధిలో భారీగా లాభాల బాటలో పయనిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత 500 బస్సులు కొనుగోలు చేశామని, వీటిల్లో 400 బస్సులు పల్లెవెలుగు బస్సులే ఉండడం విశేషమని చెప్పారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. స్థానిక ఆర్టీసి డిపోలో అధికంగా బస్సులు ఉండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అందుకు అనుగుణంగా హయత్‌నగర్ మండలం యంజాల్‌లో బస్‌డిపో ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. యంజాల్‌లో బస్‌డిపో ఏర్పాటుకు స్థలం కేటాయించినప్పటికీ ప్రారంభించడం లేదని చెప్పారు.