రంగారెడ్డి

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఏప్రిల్ 30: అంకిత భావంతో ఉద్యోగం నిర్వర్తించి అందరి మన్నలను పొందిన ఫీల్డ్ ఆఫిసర్ జగదీశ్వర్‌రెడ్డిని తోటి ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీటిసి సభ్యడు మంద సంజీవరెడ్డి అన్నారు. మండల రైతు సేవా సహకార సంఘంలో 33 సంవత్సరాలు ఫీల్డ్ ఆఫిసర్‌గా విధులు నిర్వర్తిస్తు మండల రైతులకు అనేక విశిష్ఠ సేవలు అందించి మన్నలను పొందినట్లు తెలిపారు. క్రమ శిక్షణతో విధులను నిర్వర్తించి మండల వ్యాప్త ప్రజలకు దగ్గర అయినట్లు పేర్కొన్నారు. మండల రైతు సేవా సహకార సంఘం చైర్మన్ గొంగళ్ల స్వామి మాట్లాడుతు మండల ఫీల్డ్ ఆఫిసర్‌గా తన ఉద్యోగం పూర్తి కాలం ఇక్కడే పని చేసి అందరి మన్నలను పొందినట్లు చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఎండి వెంకటనారాయణ, మేనేజర్ రాజ్‌గోపాల్, రాష్ట్ర విత్తన ధ్రువీకరణ అప్పిలేట్ అథారిటీ సభ్యుడు రేసు లక్ష్మారెడ్డి, డైరక్టర్లు సత్తరెడ్డి, కొంతం అంజిరెడ్డి, సత్తయ్య, నాయకులు రామోజి, శ్రీరాములు, విశ్వనాథం పాల్గొన్నారు.
అంకిత భావంతోనే
విజయం సాధ్యం
రాజేంద్రనగర్: అంకితభావంతో ఏ రంగంలోనైనా పని చేసినప్పుడే అనుకున్నది సాధిస్తామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి డాక్టర్ వీ.ప్రవీణ్‌రావు అన్నారు. శనివారం విశ్వవిద్యాలయంలో ఆఫీస్ ఇన్‌చార్జిగా పని చేస్తున్న కె.ప్రభుదాస్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని సన్మానించారు. పెద్దల పట్ల గౌరవం, పని పట్ల అంకితభావం ఉన్న వ్యక్తి ప్రభుదాస్ అని పొగడ్తలతో ముంచెత్తారు. కేర్ టేకర్‌గా యూనివర్సిటీ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారని, ప్రభుదాస్‌కు మంచిపేరు, ప్రతిష్టలు సంపాధించారని చెప్పారు. కార్యక్రమంలో బోధన, బోధనేతర, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి
గచ్చిబౌలి: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. కమిషనరేట్‌లో పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో ఆనంద్ మాట్లాడారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులను అభినందించారు. కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఐదుగు ఎస్‌ఐలు, ఒక ఎఎస్‌ఐ, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు పదవీ విరమణ చేశారు. కార్యక్రమంలో అధికారుల సంఘం నాయకులు భద్రారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.