రంగారెడ్డి

పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచాల: రాష్ట్రంలో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పట్నం మహేంధర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్లలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీలో భూనిర్వాసితులైన యాచారం మండలం కుర్మిద్ధ గ్రామ రైతులకు పరిహారాన్ని పంపిణీ చేశారు. మొత్తం 363 మంది రైతుల్లో 144 మందికి 20కోట్ల రూపాయల పరిహారాన్ని పంపిణీ చేశారు. ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. నూతన పారిశ్రామిక విధానానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. ముచ్చర్లలో ఫార్మాసిటీ ఏర్పాటుతో స్థానికంగా ఉన్న నిరుద్యోగ సమస్య కొంతమేరా తీరుతుందని చెప్పారు. ఐటిశాఖ మంత్రి కెటిఆర్.. పరిశ్రమల ఏర్పాటుకు తరచూ అంతర్జాతీయంగా పర్యటనలు చేస్తు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి పరిశ్రమల ఏర్పాటుకు భూములిస్తున్న రైతులందరికి తగిన న్యాయం చేస్తామని వెల్లడించారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న పరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో బిటి రోడ్డు నిర్మాణ పనులు, కుర్మిద్ద చెరువులో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎంపిపి జ్యోతినాయక్, జడ్పీటిసి రమేష్‌గౌడ్ పాల్గొన్నారు.