రంగారెడ్డి

పంచాయతీరాజ్ వ్యవస్థ మరింత బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 30: పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, గ్రామీణ వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన అవశ్యకత ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం ఉదయం మంత్రి జిల్లాలోని మేడ్చల్ మండలం ఎల్లంపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారమే బాధ్యతలను స్వీకరించిన మంత్రి జూపల్లి.. మొదటిసారిగా ఎల్లంపేట్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేయడం గమన్హారం. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పన్నుల విధింపు విధానంలో మార్పు తీసుకు వస్తామని అన్నారు. వాస్తవ ఆదాయానికనుగుణంగా పన్నులు విధించే విధానంలేదని వివరించారు. సర్పంచ్, ఎంపిటిసి, వార్డు సభ్యులు ఇతర అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగితే గ్రామంలోని సమస్యలు గ్రామంలోనే పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆదాయ వనరులను పెంచకోవాలని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ నిధుల్లో అవకవతవకలు లేకుండా తప్పులు జరుగకుండా పాలన పారదర్శకంగా సాగాలని పేర్కొన్నారు. ఆదాయ వనరులను పెంచే మార్గాలను అనే్వషించుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులను, ప్రజలను ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగస్వాములను చేయాలని చెప్పారు. సొంత ఇంటి వలే గ్రామపంచాయతీలను చూసుకోవాలని ఆకాంక్షించారు. నగరానికి చేరువలో ఉన్న గ్రామపంచాయతీల్లో పన్ను విధింపు వాస్తవ ప్రాతిపదికన లేదని మంత్రి స్పష్టం చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ఆస్తిపన్ను, తాగునీటి అంశాలను కార్యదర్శి నర్సింహ్మను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ చిన్న తుడుంలింగం, ఎంపిటిసి రేణుక పాల్గొన్నారు. మంత్రి జూపల్లి ఆకస్మిక పర్యటన సమాచారం లేకపోవడంతో మండల స్థాయి అధికారులు ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.

జల్లులతో పులకింత
నార్సింగి, ఏప్రిల్ 30: కొన్ని రోజులుగా ఎండలు దంచికొట్టడంతో నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.తే శనివారం సాయంత్రం నగరంలో ఒక్కసారిగా ఆకాశం మేఘవృతంమై చిరుజల్లులు కురిసాయి.
చిరుజల్లులతో నగరం వాసులు కొంత మేరకు ఉపశమనం పొంపోందారు. చిరుజల్లులో వాహనదారులు, ప్రయాణీకులు తడుచుకుంటు వారివారి గమ్యస్థానాలకు చెరుకున్నారు. కాగా గత నెలరోజులుగా ఎండలు తీవ్రం కావడంతో నగర వాసులు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. పెద్ద పెద్ద వానలు పడితేగాని ఉక్కపోత పోదని నగరవాసులు పేర్కొన్నారు.
పులకించిన కూకట్‌పల్లి
కెపిహెచ్‌బికాలనీ: కూకట్‌పల్లిలో శనివారం సాయంత్రం కురిసిన చిరు జల్లులతో ఈ ప్రాంత ప్రజలు పులకరించిపోయారు. గత నెల రోజులుగా తీవ్ర ఎండలు, ఉక్కపోత, వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శనివారం ఒక్క సారిగా వర్షం పడడంతో సేద తీరారు. కూకట్‌పల్లిలో ఓ మోస్తరుగా వర్షం కురవడంతో చల్ల గాలులతో ప్రజలు ఉపశమనం పొందారు. తీవ్ర ఎండలతో అలమటిస్తూ బయటికి రావడానికి జంకాల్సిన పరిస్థితుల్లో వర్షం పడడంతో కూకట్‌పల్లి ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
మేడ్చల్‌లో ..
మేడ్చల్: మేడ్చల్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు విపరీతమైన ఎండతో పాటు వడగాల్పులు వీస్తున్నాయి అంతలోనే ఆకాశం మెల్లి మెల్లిగా మోఘావృతం కాసాగింది. సాయంత్రం 5గంటల ప్రాంతంలో స్వల్ప ఈదురు గాలులు, ఊరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షం సుమారు గంట సేపు కురవడంతో వాతావరణం చల్లబడి అప్పటివరకు ఉక్కబోత, వడగాల్పులతో ఉబ్బితబ్బివుతున్నా ప్రజలకు చల్లటి గాలులో ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. దంచికొడుతున్న ఎండలతో పిల్లలు బయటకు వెళడమే గగనంగా మారిన సమయంలో శనివారం సాయంత్రం వర్షం కురవడంతో వర్షంలో ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా గడిపారు. వాతావరణం చల్లబడటం అన్ని వర్గాల వారికి కాసింత ఊరటనిచ్చింది. మామిడి రైతుకు మాత్రం నష్టం మిగిల్చిందని మాత్రం చెప్పకతప్పదు.
ఘట్‌కేసర్‌లో..
ఘట్‌కేసర్: ఘట్‌కేసర్ మండల పరిధిలో శనివారం సాయంత్రం వర్షం కురవటంతో వేసవి తాపం ఉండి మండల ప్రజలకు ఉపశమనం లభించింది.
ఘట్‌కేసర్ మండల కేంద్రంతో పాటు ఎన్‌ఎఫ్‌సినగర్, అన్నోజిగూడ, సంస్కృతి టౌన్‌షిఫ్, పోచారం, అంకుషాపూర్, యంనంపేట్ గ్రామాలలో సాయంత్రం వర్షం గాలివాన కురవటంతో వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య తొలగి పోవాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి
వికారాబాద్, ఏప్రిల్ 30: ఈ సంవత్సరం రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు జగదీష్ సూచించారు. శనివారం మన తెలంగాణ మన వ్యవసాయంలో భాగంగా మండలంలోని పీరంపల్లి, పుల్సుమామిడి గ్రామాల్లో రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ పత్తి పంట విస్తీర్ణాన్ని ఈసంవత్సరం 50 శాతానికిపైగా తగ్గించాలని చెప్పారు.
భూగర్భ జలాలు తగ్గిన కారణంగా రైతులు ఫాంపాండ్‌లు నిర్మించుకోవాలని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఖరీఫ్‌లో రైతులకు ఇబ్బంది కలగకుండా ఎరువులు, విత్తనాలు సరిపడా సిద్ధంగా ఉంచామని వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు ఆర్‌ఎం దివ్యజ్యోతి, మండల వ్యవసాయాధికారి వినె్సంట్ వినయ్‌కుమార్, వ్యవసాయ విస్తీర్ణ్ధాకారి అనిల్‌కుమార్, ఉద్యాన విస్తీర్ణ్ధాకారి లక్ష్మయ్య, పశువైద్య, మార్కెటింగ్ అధికారులు, పీరంపల్లి గ్రామ సర్పంచ్ గురువారెడ్డి, ఎంపిటిసి టి.మల్లేశం, గ్రామ కార్యదర్శి సునీత పాల్గొన్నారు.

రైతులకు న్యాయం చేయాలని 2న ధర్నాలు, రాస్తారోకో
శంషాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణలోని కరువు మండలాలను గుర్తించి రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని 2న అన్ని మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహించాలని రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు బి.నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, కరువుతో అల్లాడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
ప్రభుత్వం మొద్దునిద్ర వీడి కరువు మండలాలను గుర్తించాలని అన్నారు. తెలంగాణ బిజెపి నాయకత్వం తనపై వున్న నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిందని, 35 సం.లుగా కార్యకర్తగా పనిచేసానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ, 111 జి.ఓ పరిధిలోని 84 గ్రామాలు అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడినాయని ప్రభుత్వం వెంటనే ఆ జీఓ ఎత్తివేయాలన్నారు. అక్రమ నిర్మాణాలకు వర్తించని జిఓ కేవలం పేదవారికి వర్తిస్తుందని ఆరోపించారు.
బడాబాబులకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా అని, డబ్బులిస్తే జిఓ వుండదు, ఇవ్వకపోతే జీవో వుంటుందని అధికారులు చెప్పడం చూస్తే వారి పనితీరు ఎలా వుందో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేసారు. సమావేశంలో ఎంపిటిసి సభ్యుడు శ్రీ్ధర్, సర్పంచ్ శేఖర్‌గౌడ్, చంద్రయ్య, యాదగిరి, లక్ష్మణ్ పాల్గొన్నారు.