రంగారెడ్డి

ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల తవ్వకాలు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మే 3: ఈనెల అయిదు నుండి ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల తవ్వకాలకు శ్రీకారం చుట్టాలని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మండల కేంద్రంలోని తహసిల్ధార్ కార్యాలయంలో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ అమ్రపాలీ మాట్లాడుతు గురువారం నుండి ప్రభుత్వ ఖర్చుతో ప్రతి గ్రామంలో ఏడు నుంచి పది ఇంకుడు గుంతలను తీయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల తవ్వకాలలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలోని బోరు బావులు, వరద నీరు వచ్చే ప్రాంతాలను గుర్తించి ఇంకుడు గుంతలను తీయాలని కోరారు. చిన్న గుంతలకు నాలుగు వేలు, పెద్ద గుంతలకు ఏడు వేలు చెల్లించాలన్నారు. ఇంకుడు గుంతల తవ్వకాలలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో తహసిల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపిడిఓ కల్వకుంట్ల శోభ, మండల విద్యాధికారి నర్సింహ్మరెడ్డి, ఐకేపి ఎపిఎం తౌర్యానాయక్, ఏ ఐ లు రమేశ్, యాదగిరి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.