రంగారెడ్డి

నిబంధనలు అతిక్రమించకుండా క్వారీలపై పటిష్ట చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, నవంబర్ 18: మేడ్చల్ జిల్లా పరిధిలో క్వారీల యాజమానులు నియమ నిబంధనలను అతిక్రమించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ మండలంలోని గిర్మాపూర్ గ్రామ పరిధిలోని రాక్ సిలికాన్ క్వారీ (క్రషర్)ను స్థానిక తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మైనింగ్ ఏడి స్వామి ఇతర అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పలు క్వారీల నిర్వాహకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం క్వారీలో కలియ తిరుగుతూ రోబోసాండ్, కంకర, క్వారీని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఇసుక రవాణా తగ్గినందున ప్రభుత్వం ప్రత్యామ్నయ చర్యల దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. అందుకు ప్రత్యామ్నయంగా రోబోసాండ్‌ను పరిశీలిస్తున్నామని దాని నాణ్యతను తెలుసుకునేందుకే క్వారీని స్వయంగా సందర్శించినట్లు వివరించారు. జిల్లా పరిధిలో 8 క్రషర్‌లు ఉన్నాయని, ఇసుక డిమాండ్ ఉండగా సరఫరా తగ్గిపోయిందన్నారు. హైదరాబాద్ మహానగరానికి 15 లక్షల టన్నుల ఇసుక అవసరం ఉండగా కేవలం 12 లక్షల ఇసుక మాత్రమే సరఫరా అవుతున్నదని 3 లక్షల టన్నుల ఇసుక కొరత ఉందని పేర్కొన్నారు.
రోబోసాండ్ వినియోగం పెంచడం ద్వారా ఇసుక కొరతను నివారించడంతో పాటు కృతిమ ఇసుక, అక్రమ ఇసుక రవాణాను కూడా అరికట్టవచ్చునన్నారు. నది ఇసుకతో సమానంగా రోబోసాండ్ సామర్ధ్యం కల్గి ఉంటుందని క్వారీ నిర్వాహకులు ప్రొజెక్టర్ ద్వారా వివరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. రోబోసాండ్ వినియోగం పెరిగితే నదుల నుండి ఇసుక సరఫరా తక్కువై పర్యావరణానికి కూడా ఎలాంటి ముప్పు వాటిల్లదని అన్నారు. భవిష్యత్తులో ఇసుకకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని కనుక దీనిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. కృతిమ ఇసుకను కూడా అరికట్టవచ్చునన్నారు. క్వారీల వద్ద స్థానికుల ఇబ్బందులను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. క్వారీల చుట్టుపక్కల వారికి దుమ్ము, ధూళీ, శబ్దకాలుష్యం వంటివి లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని అంశాలను మరింత లోతుగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. క్రషర్‌ల నిర్వాహకులు నియమ నిబంధనలు అతిక్రమించకుండా పటిష్టమైన నిఘాపెట్టడంతో పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని ప్రకటించారు. అదేవిధంగా క్వారీలలో పనిచేసే కార్మికుల ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోబో సిలికాన్‌లో పనిచేసే కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. క్వారీలో పనిచేసే కార్మికులకు బీమా సౌకర్యం ఉందా.. ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా.. ఎన్ని గంటలు పని చేస్తున్నారు.. ఎక్కడ ఉంటున్నారు.. పని చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు తదితర వివరాలను కలెక్టర్ కార్మికులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అప్పుడప్పుడు క్వారీల్లో తనిఖీలు చేస్తున్నారా అని మైనింగ్ ఏడి స్వామిని అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన యువకులు ఇక్కడ దుమ్ము, ధూళిలో పని చేస్తున్నారని ప్రస్తుతం యూత్ కాబట్టి ఆరోగ్య సమస్యలు తెలియవని వయస్సు పైబడిన కొద్ది ఆరోగ్య సమస్యలు మొదలవుతాయని క్వారీలో పనిచేసే కార్మికులకు అన్నిజాగ్రత్తలు విధిగా పాటించాలని క్వారీ నిర్వాహకులకు సూచించారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా క్వారీలో పనిచేసే కార్మికులకు శిక్షణ కూడా ఇవ్వాలని చెప్పారు. తదనంతరం కలెక్టర్ క్రషర్‌లోని శాండ్‌ను, కంకరను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్రషర్‌తో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గిర్మాపూర్ గ్రామస్థులు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. క్రషర్‌ల ద్వారా దుమ్ము రేగడంతో పాటు పేలుళ్ల ధాటికి ఇళ్ల అద్దాలు గోడలు పగిలిపోతున్నాయని తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దీంతో స్పందించిన కలెక్టర్ గ్రామస్థుల ఫిర్యాదులను స్వీకరించి పరిశీలిస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపిపి విజయలక్ష్మీ, స్థానిక సర్పంచ్ నవనీత ఆనంద్, క్వారీల నిర్వాహకులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.