రంగారెడ్డి

మేడ్చల్ పట్టణ రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, నవంబర్ 22: మేడ్చల్ పట్టణంలోని పలు ప్రదేశాల్లో బహిరంగంగా చెత్తవేస్తే జరిమానా తప్పదని నగర పంచాయతీ కమిషనర్ కె. రామిరెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఆయా ప్రదేశాల్లో సూచికబోర్డులను ఏర్పాటు చేయించారు. పట్టణ ప్రధాన కూడలి అంబేద్కర్ విగ్రహాం నుండి రైల్వేస్టేషన్ వరకు గల రోడ్డుతో పాటు తహశీల్దార్ కార్యాలయం రోడ్డుపై ఎవరైనా బహిరంగంగా చెత్తను పారబోస్తే వారికి రూ. 500 నుండి 5 వేల వరకు జరిమానా విధించనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా పెద్ద చెరువుకట్ట, తుమ్మ చెరువు, రామునికుంట ప్రదేశాలలో బహిరంగ మల, మూత్ర విసర్జన చేసిన వారికి రూ. 500 జరిమానా విధిస్తామని వివరించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో సూచికబోర్డులను అమర్చామని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కమిషనర్ కోరారు. మేడ్చల్ పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో పౌరులందరూ సహకరించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటివారైనా జరిమానా తప్పదని హెచ్చరించారు.