రంగారెడ్డి

రిజిస్ట్రేషన్‌లపై పెద్ద నోట్ల ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, నవంబర్ 22: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దుతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలపోతున్నాయి. రెండు వారాల క్రితం కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లును రద్దు చేసింది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా పలు వ్యాపార సంస్థలు అయితే మూతపడే అవకాశాలు వచ్చాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా గత రెండు వారాలుగా రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో వెలవెల బోతున్నాయి. పెద్ద నోట్లు రద్దుతో భూముల అమ్మకాలు, కొనుగోలు కూడా భారీగానే నిలిచిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా నష్టం వచ్చే ప్రమాదం ఉందని పలువురు పేర్కొన్నారు. కాగా ఈనెల మొదటి తేది నుంచి 8వ తేది వరకు ఏడు రోజుల్లో 101 రిజిస్ట్రేషన్లు అయ్యాయని రెడిహిల్స్ జెయింట్ సబ్ రిజిస్ట్రార్-01 వి.రవీందర్ తెలిపారు. ఈనెల 8వ తేదిన రాత్రి కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లును రద్దు చేశారు. దీంతో ఈనెల తొమ్మిదవ తేదీ నుంచి ఈనెల 19వ తేది వరకు కేవలం 41 మాత్రమే రిజిస్ట్రేషన్లు అయ్యాయని తెలిపారు. కాగా సోమ, మంగళవారాల్లో మరో పది రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయని పేర్కొన్నారు. పెద్ద నోట్లు రద్దుతో భారీగానే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో డిసెంబర్ చివరి వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని రిజిస్ట్రార్ రవీందర్ తెలిపారు.
పూల మార్కెట్ వెలవెల
పెద్ద నోట్ల రద్దుతో కొనుగోళ్లు, అమ్మకాలు లేక హైదరాబాద్‌లోని అతిపెద్ద గుడిమల్కాపూర్ పూల మార్కెట్ వెలవెలబోయింది. కొనుగోలు దార్లతో కిటకిటలాడే పూల మార్కెట్ ఒక్కసారిగా బోసిపోయింది. పూల పెంపకం దార్లు ప్రతి రోజూ క్వింటాళ్ల కొద్దీ పూలు గుడిమల్కాపూర్ మార్కెట్‌కు తరలిస్తారు. వికారాబాద్, చేవెళ్ల, శంకరపల్లి నుంచే కాకుండా బెంగుళూరు నుంచి కూడా పూలు ఇక్కడి మార్కెట్‌కు వస్తాయి. నోట్ల రద్దుకు ముందు కిలో పూలు రూ. 40నుంచి రూ. 50వరకు ధర పలుకగా ప్రస్తుతం కిలో పూలు రూ. 10నుంచి 15కు ఇస్తామన్నా ఎవరూ కొనడం లేదని పూల వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. హోల్‌సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు పూల అమ్మకాలు సాగక మార్కెట్‌లోనే పడేసి పోతున్నారని ప్రవీణ్‌కుమార్ అనే వ్యాపారి వాపోయారు. రూ. 2వేల నోటు ఇచ్చి కిలో పూలు కావాలంటే..చిల్లర ఇవ్వలేని దుస్థితి నెలకొంది. దీంతో పూలు ఉచితంగానే ఇవ్వాల్సి వస్తోందని మరో పూల వ్యాపారి రహ్మాన్ ఖాన్ వాపోయాడు.
పాతనోట్ల మార్పిడికి కొత్త పథకం
బ్యాంకుల వద్ద రద్దీతో విసిగిపోయిన వారికి హైదరాబాద్ ఎర్రగడ్డ రైతు బజార్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రీయ భండార్ అనే సంస్థ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ సంస్థ ఎర్రగడ్డలోని రైతు బజార్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. అక్కడ పాత రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకొని అంతే విలువైన నిత్యావసరాలు ఇస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రైతు బజార్లపై తీవ్రంగా పడింది. చిల్లర లేక, ఉన్న పాత నోట్లను మార్చుకోలేక జనం నానా ఇబ్బందులు పడుతున్నారు.
వెలవెలపోతున్న దుకాణాలు
శంకర్‌పల్లి: నల్ల కుబేరుల అక్రమాలను అరికట్టాలని మోది ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దుతో పేద మధ్య తరగతుల దుకాణదారులు వ్యాపారం సాగక విలపిస్తున్నారు. 500, 1000నోట్ల రద్దుతో చిల్లర కొరత ఏర్పడి నిత్యావసర వస్తువులు కొనలేక ప్రజలు, గిరాకి లేక వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు.. శంకర్‌పల్లికి చెందిన మిఠాయి భండార్ యజమానులు రూప మాట్లాడుతూ శనివారంనాడు 400, ఆదివారం నాడు 500 రూపాయల వ్యాపారం జరిగిందని, షాపు కిరాయి కూడా రావడంలేదని విలపిస్తున్నారు. ఆదివారం, బుధవారం శంకర్‌పల్లిలో నాలుగైదు కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ నోట్ల దెబ్బతో కోటికి పడిపోయిందని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశాభివృద్ధికోసం మోది తీసుకున్న నిర్ణయం మంచిదే కాని దీనివల్ల పేద ప్రజలకు కష్టాలు కలుగుతున్నాయని, కాబట్టి వెంటనే అధిక మొత్తంలో చిల్లర డబ్బులను ప్రభుత్వం విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.